విధి వైపరీత్యం అంటే ఇదేనేమో! హఠాన్మరణానికి గురైన ఓ వ్యక్తి పోస్టుమార్టం సమయంలో ఒక్కసారిగా లేచి అందరినీ షాక్ కి గురి చేశాడు. రెండురోజులపాటు ప్రాణాలతో వున్నాడు కూడా! ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ ఆ వ్యక్తి మళ్లీ చచ్చిపోయాడు. ఈ వింత సంఘటన దేశ ఆర్థిక నగరం ముంబైలో చోటు చేసుకుంది.
గత ఆదివారం ముంబయిలో నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమం నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. రోడ్లు వెంట పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ క్రమంలో ఓ ఆస్పత్రికి సమీపంలో ప్రకాశ్(50) అనే ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడు. అతనిని గమనించిన పోలీసులు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతని నాడీ పరీక్షించిన వైద్యుడు ఆ వ్యక్తి చనిపోయినట్లుగా నిర్ధారించాడు. దీంతో పోస్టుమార్టానికి కావాల్సిన ప్రక్రియ పూర్తి చేశారు. కాసేపట్లో డాక్టర్లు పోస్టుమార్టం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఆ వ్యక్తి ఒక్కసారిగా లేచి కూర్చుని.. మొత్తం ఆస్పత్రినే కాకుండా పోలీసులను కూడా అవాక్కయ్యేలా చేశాడు. దీంతో.. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో బతికి ఉన్న వ్యక్తిని చనిపోయాడని చెప్పారని పలు రకాలుగా విమర్శించారు.
ఏదైతేనేం.. మృత్యువు నుంచి తిరిగి బత్రికిన ఆ వ్యక్తిని వెంటనే ఐసీయూలోకి తరలించారు. అక్కడ అతనికి మెరుగైన చికిత్స అందించారు. రెండు రోజులపాటు ప్రాణాలతో వున్నాడు. అయితే.. ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ ఆ వ్యక్తి ఐసీయూలోనే చనిపోయాడు. ఆస్పత్రి డీన్ సులేమాన్ మర్చంట్ ఈ విషయం ధ్రువీకరించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more