7 years lod boy naveen kidnapped in hyderabad hayatnagar | hyderabad crime stories | women kidnap stories

7 years lod boy naveen kidnapped doubts on neighbour woman hyderabad crime stories

7 years boy kidnap, hyderabad kidnap, neighbour women kidnapped boy, hayatnagar kidnap story, women kidnapped boy, woman kidnap neighbour boy

7 years lod boy naveen kidnapped doubts on neighbour woman hyderabad crime stories : 7 years lod boy naveen kidnapped in hyderabad hayatnagar. family members showing doubts on neighbour women.

బాలుడి కిడ్నాప్ మిస్టరీ.. పక్కింటి మహిళే కిడ్నాపరా?

Posted: 10/15/2015 11:44 AM IST
7 years lod boy naveen kidnapped doubts on neighbour woman hyderabad crime stories

ఆడుకోవడానికని ఇంటినుంచి బయటకు వెళ్లిన ఓ యేడేళ్ల నవీన్ తిరిగి ఇంటికి రాలేదు. కానీ.. అతనితో ఆడుకున్న మరో బాలుడు మాత్రం క్షేమంగానే ఇంటికి చేరాడు. తమ కుమారుడు నవీన్ ఎంత ఆలస్యమవుతున్నా ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు మరో బాలుడ్ని అతని గూర్చి విచారింగా.. ఎవరో ఇద్దరు వ్యక్తులు నవీన్ ని ఎత్తుకెళ్లిపోయారని సమాధానమిచ్చాడు. రెండు రోజులు అవుతున్నా అతడి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. అయితే.. పక్కింటి మహిళే తమ పిల్లాడిని కిడ్నాప్ చేసి వుంటుందని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్లో ఉండే నరసింహా దంపతుల కొడుకు నవీన్ (7) కుంట్లూరులో రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటున్న నవీన్ను గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి అపహరించుకుపోయారు. నల్లటి శాంత్రోకారులో వచ్చిన దుండగులు అతడిని అపహరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, పక్కింటి మహిళే కోపంతో తమ పిల్లాడిని కిడ్నాప్ చేయించి ఉంటుందని బాలుడి బంధువులు అనుమానిస్తున్నారు. మంగళవారం తమ పక్కింటి మహిళ అబ్బాయి, నవీన్ ఇద్దరూ అడుకోడానికి బయటకు వెళ్లారని, కానీ కొద్ది సేపటి తర్వాత ఆ అబ్బాయి ఒక్కడే వచ్చాడని నవీన్ బాబాయ్ శంకర్ తెలిపాడు. నవీన్ ఎంతసేపటికీ రాకపోవడంతో ఎక్కడున్నాడని అడిగితే.. ఇద్దరు వ్యక్తులు నల్లటి కారులో వచ్చి నవీన్ను ఎక్కించుకుని వెళ్లిపోయారని అతడితోపాటు ఉన్న మరో బాలుడు చెప్పినట్లు ఆయన తెలిపాడు. ఆమె మీదే తమకు అనుమానం ఉందని మరోసారి శంకర్ అనుమానం వ్యక్తం చేశాడు.

ఈ కిడ్నాప్ ఉదంతంపై తాము ఆ బాలుడి తల్లి (పక్కింటి మహిళ)ని అడిగితే.. తనకేం తెలియదని, తననెందుకు అడుగుతారని దబాయిస్తోందని శంకర్ చెప్పాడు. తనకు పోలీసులు తెలుసని, ఏమైనా చేసుకోండని అంటోందన్నారు. ఆమె ప్రవర్తన బాగోలేకపోవడం గతంలో ఆమెతో ఇల్లు ఖాళీ చేయించాలని యజమానులకు చెప్పడం వల్ల... కోపంతోనే తమ అన్న కొడుకును ఆమె కిడ్నాప్ చేయించి ఉంటుందని శంకర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు.. ఆమె మీద కూడా దృష్టి సారించినట్లు తెలిసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman kidnap neighbour boy  hyderabad crime stories  hyd kidnap stories  

Other Articles