ఆదాయ పన్ను శాఖ అధికారుల అంచానాలు తప్పుతున్నాయా..? అగ్రశేణ్రి హీరోలు, లేక భారీ బడ్జెట్ చిత్రాలపై వారు వేస్తున్న గురి తప్పుతుందా..? అంతా అంకెల గారడీయేనా..? లేక వాస్తవాలా అన్నది మాత్రం తేల్చలేకపోతున్నారా... లేక తేల్చినా.. గోప్యంగా పెడుడుతన్నారా..? అసలెందుకు ఆదాయ పన్ను శాఖ అదికారులు సినీమా వాళ్లపై పడ్డారు. అన్న ప్రశ్నలు తాజాగా సగటు ప్రేక్షక లోకానికి, అభిమానులలోనూ రేకెత్తుతున్నాయి.
తాజాగా మెగా పవర్ స్టార్ నటించిన బ్రూస్ లీ చిత్రంపై కూడా అదాయపన్ను అధికారులు దాడులు చేయడమే ఇందుకు కారణంగా కనబడుతోంది. బ్రూస్ లీ సినిమా నిర్మాత, దర్శకుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.నిర్మాత డివివి దానయ్య, దర్శకుడు శ్రీను వైట్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ హఠాత్పరిణామంతో టాలీవుడ్ వర్గాలు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యాయి.
కొద్ది రోజుల క్రితం తమిళనాడులో పులిచిత్రం విడుదల సందర్భంగా కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు చిత్ర నిర్మాణ సంస్థతో పాటు ఆ చిత్ర నటీనటుటు విజయ్, నయనతార, సమంత ఇళ్లపై కూడా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడులతో కాలీవుడ్ లో సంచలనంగా మారిన ఐటీ అధికారులు.. ఇటు టాలీవుడ్ లోనూ తమ పంజా విసిరారు. అయితే ఈ దాడుల్తో వారు తమ ఉనికి చాటుకుంటున్నారా..? కేవలం అందుకనే దాడులను చేస్తూ.. పరిశ్రమ వర్గాలను సందిగ్ధంలోకి నెడుతున్నారా..? అన్న ప్రశ్నలు కూడా అభిమాన లోకం నుంచి వెల్లువెత్తుతున్నాయి. అయితూ వీటికి సమాధానాలు ఏమిటన్నది మాత్రం వారికే తెలియాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more