మీకు అర్జెంటుగా చిన్న మొత్తం రుణంగా కావాలా..? ఏ ప్రైవేటు ఫైనాన్సర్ దగ్గరికో వెళ్తే సరి అని అనుకుంటున్నారా..? అయితే మీ అలోచనలు మానుకోండి. ఇకపై మీకు చిన్నపాటి మొత్తం లోన్ గా కావాలంటే.. మీ బ్యాంకు ఏటీయం ను నమ్మకోండి. అబ్బే బ్యాంకు నుంచి రుణం పోందాలంటే వారడిగే శతకోటి ప్రశ్నలు, అందుకు సంబంధించిన డాక్యూమెంట్లు కూడా లేవు. వున్న కాగితాలతో వారు రుణం ఇవ్వరు అనుకుంటూ నిట్టూర్చుతున్నారా..? అయితే మీకు పస్పులో కాలేసినట్టే. ఇకపై మీకు ఆ చింత లేదు.
ఎందుకంటే ఇకపై బ్యాంకు నుంచి చిన్నపాటి రుణం పోందేందుకు కేవలం ఏటీఎం కార్డు మాత్రమే చాలు. అదే ఎనీ టైమ్ మనీ కార్డు ఇపుడు ఎనీ టైం లోన్ కార్డ్ గా కూడా అవతరించింది. ఏటీఎం ద్వారా అప్పటికప్పుడు లోన్ తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో గత మూడు దశాబ్దాలుగా మన జీవితాల్లో పెనవేసుకుపోయిన ఏటీఎం కార్డు ఇపుడు మరో విప్లవాత్మక పాత్ర పోషించనుంది. ఎనీ టైం లోన్ తో ఏటీఎం కార్డు ద్వారా చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తోంది. వ్యక్తిగత రుణాల వ్యవస్థను బలోపేతం చేసిన హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు తమ దగ్గర ఉన్న వినియోగదారుల ఖాతాకు సంబంధించిన వివరాలు తదితరాలను పరిశీలించి అప్పటికప్పుడు రుణం తీసుకునే సదుపాయాన్ని కల్పించింది.
ఈ వివరాలను పరిశీలించేందుకు బ్యాంకుకు సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్ లో లాగిన్ అయిన తర్వాత కేవలం పది నిమిషాలు సరిపోతుందని బ్యాంక్ తెలిపింది. ఈ పద్ధతి ద్వారా వినియోగదారులను, ఖాతాదారులను పెంచుకునేందుకు బ్యాంక్ పథక రచన చేసింది. ఈ క్రమంలో ఏటీఎంల సంఖ్యను బాగా పెంచుకుని తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ఆలోచిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన ఆటోమేటెడ్ టెల్లర్ మిషిన్.. నో.. ఎనీ టైం మనీ.. అని పిలిచే ఏటీఎం ఇపుడు ఎనీ టైం లోన్ అంటూ దూసుకుపోవడానికి రెడీ అవుతోంది. ఇక ఇదే బాటలో అన్ని బ్యాంకులు కూడా నడిచేందుకు సిద్దమవుతున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more