మనిషిని సమాధి చేస్తారా..? ఇది మనుషులు చేసే పనియేనా అంటూ స్వర్గీయ ఎన్టీయార్ ఓ చిత్రంలో పాడిన పాట. కానీ ఇప్పుడాయన బతికే వుంటే.. మనుషులు చస్తుంటే చూస్తారా..? ఇది మనుషులు చేసే పనియేనా అని పాడేవారు. ఎందుకంటటే పదమూడేళ్ల బాలుడు నెత్తురోడుతూ నేల వాలిపోతుండగా.. మానవత్వంతో ఆదుకోవాల్సిన స్థానికులు కనీస కనికరం లేకుండా.. కసాయిలుగా మారారు. బుల్లెట్ గాయాలతో బాధపడుతున్న బాలుడికి అపన్న హస్తం అందించకపోగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి తిట్లు పురాణం విప్పాడు. 'చావురా.. చావు' అంటూ నెత్తుటి మడుగులో ఉన్న బాలుడిని తిట్టిపోశాడు. ఈ అమానుష వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది.
నిత్యం ఉప్పు-నిప్పులా ఉండే పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య తాజాగా నెట్ లోకి చేరిన ఈ వీడియో.. మళ్లీ ఉద్రిక్తతలను రేపుతున్నది. గత కొన్నాళ్లుగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న దాడులతో ఈ ప్రాంతంలో అశాంతి నెలకొనగా... తాజా వీడియోతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇద్దరు ఇజ్రాయిలీలపై కత్తితో దాడి చేశాడనే ఆరోపణలతో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడిపై ఇజ్రాయెల్ సైనికులు గత సోమవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దారుణంగా గాయపడ్డ అహ్మద్ మనస్రా అనే బాలుడు చనిపోయాడని పాలస్తీనా చెబుతుంది, మరోవైపు అతడు బతికే ఉన్నాడని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఫొటోలు చూపించి ఇజ్రాయెల్ వాదిస్తున్నది. బాలుడిపై జరిగిన దారుణ దాడికి సంబంధించిన వీడియోను ఇటు ఇజ్రాయిలీలు, అటు పాలస్తీనా వాసులు పోస్టుచేసి.. తమదైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇజ్రాయెల్ సైన్యాల క్రూరత్వానికి, పైశాచికిత్వానికి ఈ వీడియో పరాకాష్ట అని పాలస్తీనా వాసులు పేర్కొంటుండగా.. పాలస్తీనాకు చెందిన పదమూడేళ్ల బాలుడు నుంచి కూడా తమకు ముప్పు పొంచి ఉందనడానికి ఈ ఘటన నిదర్శనమని ఇజ్రాయిలీలు పేర్కొంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కత్తిపోటు ఘటనలు, హింసాత్మక ఆందోళనలు.. ఈ ప్రాంతంలో మళ్లీ తీవ్రస్థాయి తిరుగుబాటుకు దారితీసి.. మళ్లీ అశాంతి చోటుచేసుకునే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇటు పాలస్తీనా వాసులు, అటు ఇజ్రాయెల్ వాసులు ఆన్లైన్లో దాడులు, కాల్పులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తూ తీవ్రస్థాయి యుద్ధమే జరుపుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more