Balakrishna Fans donating one lakh bricks

Balakrishna fans donating one lakh bricks

Balakrishna, Balayya Fans, Balakrishna Fans, Balakrishna News, nandamuri Balakrishna, Amaravati, AP, Chandrababu, Bricks, Jai Balayya bricks

Nandamuri Balakrishna fans donating one lakh bricks for amaravati construction. Chandrababu Naidu intives donations and moral support from people.

అమరావతికి బాలయ్య ఫ్యాన్స్ లక్ష ఇటుకలు

Posted: 10/19/2015 03:38 PM IST
Balakrishna fans donating one lakh bricks

ఏపి రాజధాని అమరావతి నిర్మాణానికి అందరి సహాయం కోరుతున్నారు. ప్రజారాజధాని నిర్మాణానికి ప్రజల మద్దతును, ఆర్థిక సహాయాన్ని కోరుతున్నారు. అందులో భాగంగా అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేలా.. ఈ బ్రిక్స్ పేరుతో ఇటుకలను విరాళంగా కోరుతున్నారు. అయితే తాజాగా బాలయ్య ఫ్యాన్స్  తమ నిండు మనసును చాటేలా.. అమరావతి  నిర్మాణంలో తమ పాత్ర చిరస్థాయిలో నిలిచిపోయేలా ఇటుకలను విరాళంగా అందించనున్నారు. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారేమో కానీ అందిస్తున్నది..  కొన్ని ఇటుకలను కాదు.. లక్ష ఇటుకలను అమరావతి నిర్మాణానికి అందించనున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఇలా తమ అభిమాన హీరో పేరుతో ఏకంగా లక్ష ఇటుకలను అమరావతికి అందించడం చిరస్థాయిలో నిలిచిపోతుంది.

‘‘తెలుగు జాతిని . కీర్తిని ,పౌరుషాన్ని. విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన అన్న నందమూరి తారక రామారావు సాక్షి గా , తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా తెలుగు పార్టీ ఆషాకిరణం మన లెజెండ్ బాలయ్య స్పూర్తితో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి మా వంతు బాధ్యతగా ఒక లక్ష ఇటుకలను ప్రతి ఇటుక పై జై బాలయ్య అని వ్రాసి త్వరలో బాలయ్య గారికి అందజేస్తాం . ఆయన చేతుల మీదుగా నవ్యాంధ్ర నిర్మానాణికి అందిస్తాం’’ అంటూ నందమూరి ఫ్యాన్స్ వెల్లడించారు. వీలైతే అమరావతి నిర్మాణంలో రోజు కూలీలుగా కూడా పని చేస్తామని తెలిపారు. మొత్తానికి ఆంధ్రుల నూతన రాజధాని అమరావతికి బాలయ్య ఫ్యాన్స్ చేస్తున్న సహాయం చారిత్రాత్మకం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles