CB-CID police arrest two more in sexual assault case

Cb cid police arrest ten in shiva ganga rape case

shiva ganga rape case, Crime Branch CID, 17 year old girl, charges of raping a minor girl, Manamadurai, shiva ganga sexual assult, shiva ganga victim, shiva ganga accused, ips officers in shiva gangarape case

Taking over the investigation in a Shiva Ganga rape case, the Crime Branch CID police have arrested ten persons, including father and brother of the victim

శివగంగా అత్యాచార కేసులో..సిఐ సహా పది మంది అరెస్

Posted: 10/20/2015 09:34 PM IST
Cb cid police arrest ten in shiva ganga rape case

యావత్ దేశం విస్తుగోలిపిన ఘటన అది. పాము తన పిల్లను తానే తిన్నట్లు.. వావివరుసలు మర్చిన తండ్రి, సోదరుడు సహా ఆ బాలికపై 28 మంది అత్యాచారం చేశారు. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వారిలో చట్టాన్ని పరిరక్షించాల్సిన కాకీలు కూడా వున్నారు. అంతేకాదు ఐఎఎస్ పరీక్షలు రాసి పోలీసు ఉన్నతాధికారులుగా చలామణి అవుతున్న అధికారి కూడా వున్నారు. కాఫీ పొడి విక్రయించే కుర్రాడి నుంచి అవకాశం కోసం ఎదురుచూసిన ప్రతీ మృగాడు అ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. పైశాచికత్వంతో తెగబడ్డారు. మైనర్ బాలిక అని కూడా చూడకుండా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా.. దారుణానికి ఒడిగట్టారు.

తమిళానాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ సంఘటనలో 28 మంది నిందితులుండగా ఇప్పటివరకూ 10 మందిని అరెస్టు చేశారు. కోర్టు అదేశాల మేరకు సిబి సిఐడి అధికారులు ఈ కేసు దర్యాప్తును చేపట్టి.. నాలుగు రోజులు గడవటం.. ఇప్పటికే పది మందిని అరెస్టు కావడంతో.. మిగిలిన నిందితుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బాలికపై తను అత్యాచారం జరుపటమే కాక ఉన్నతాధికారుల కామవాంఛ తీర్చుకునేందుకు సైతం సాయపడిన మదురై సీఐను సీబీసిఐడీ పోలీసులు అరెస్టు చేయనున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం చెన్నైలో పనిచేస్తున్న ఏడీజీపి వద్ద విచారణ జరుపనున్నారు.
 
శివగంగకు చెందిన 17 యేళ్ల బాలికపై ఆమె తండ్రి, సోదరుడు, బంధువులు, చుట్టుపక్కల నివసిస్తున్న యువకులు, డాక్టర్లు, పోలీసులు, పోలీసు ఉన్నతాధికారులు అత్యాచారం జరిపారు. ఇప్పటికే ఈ కేసులో బాలిక తండ్రి, సోదరుడు, శివగంగై ఎస్‌ఐ శంకర్‌, కండెక్టర్‌ నమశివాయం సహా 8 మందిని అరెస్టు చేశారు. పలువురి అత్యాచారం వల్ల గర్భం ధరించిన ఆ బాలిక అబార్షన్‌ కోసం ఆసుపత్రికి వెళ్లినా అక్కడ డాక్టర్‌, సిబ్బంది కూడా ఆమెపై అత్యాచారం జరిపారు. అంతే కాకుండా మదురై సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏడీజీపి, ఇతర పోలీసులు కూడా ఆ బాలిక వద్ద తమ కామవాంఛ తీసుకున్నారని వెల్లడి కావటంతో కేసు విచారణను సీబీసీఐడీ పోలీసులకు అప్పగించారు. దీనితో కేసు విచారణ ఊపందుకుంది.
 
తాజాగా శివగంగలో కాపీపొడి దుకాణం నడిపే కార్తికేయన్‌, మానామదురైలోని సహకార సంఘం మిల్లు ఉద్యోగి రామనాధన్‌ను అరెస్టు చేశారు. ఆ బాలిక ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మదురైలోని స్టార్‌ హోటల్‌ లో ఉన్నత పోలీసు అధికారులు ఆమెపై అత్యాచారం జరిపారని తెలిసింది. తనపై అత్యాచారం జరిపిన పోలీసులు ధరించిన యూనిఫామ్‌పై ఉండే చిహ్నాలను కూడా ఆ బాలిక సీబీసిఐడీ పోలీసులకు తెలిపింది. బాలిక చెప్పిన వివరాలను బట్టి ప్రస్తుతం చెన్నైలో పనిచేస్తున్న ఏడీజీపి అత్యాచారం జరిపినట్లు తెలుసుకున్నారు.

ఆ స్టార్‌ హోటల్‌లో ఏడీజీపి బసచేసినట్లు తెలిపే ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. ప్రస్తుతం మదురై సీఐను అరెస్టు చేసి విచారణ జరిపేందుకు సమాయత్తమవుతున్నారు. ఆ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వద్ద విచారణ పూర్తయిన వెంటనే ఏడీజీపి వద్ద విచారణ జరుపనున్నారు. ఇది ఇలా ఉండగా అత్యాచారం గురించి తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ బాలిక అత్త సెల్విపై కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేరాలలో ఆమెకు కూడా భాగస్వామ్యం ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shiva ganga  17 year old  minor girl  madhurai  

Other Articles