seven ways to go ap capital amaravati foundation spot

Seven routes that lead to andrapradesh capital amaravati inaugural venue

Andhra pradesh government, amaravati foundation spot, sapthapathi, seven routes to amaravathi, ap government guidelines to amaravati invitees, seven differnt ways to amaravathi spot, AAA pass holders, AA and A pass holders, general invitees, VIPS, prakasam barrage, capital foundation, chandrababu, PM modi

Andhra pradesh government issues guide lines to reach to invitees to capital amaravathi foundation venue, seven differnt ways to the spot

అమరావతికి వెళ్లాలంటే.. సప్తపదులు తెలియాల్సిందే..!

Posted: 10/21/2015 03:20 PM IST
Seven routes that lead to andrapradesh capital amaravati inaugural venue

నవ్యంద్ర ప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సప్తపదులను ప్రకటించింది. అదేనండీ ఏడు మార్గాలను ప్రకటించింది. ఇందులో రెండు పూర్తిగా వీఐపీల కోసం కేటాయించగా ఐదింటిని సాధారణ ప్రజలు వచ్చే వాహనాలకు కేటాయించింది. అమరావతి వెళ్లే అతిధులు, ప్రజలు ఈ సప్తపదుల గురించి తెలుసుకుని.. వాటికనుగూనంగానే వెళ్లాలని పోలీసులు కోరారు.
 
 ఏఏఏ పాస్‌లున్న వాహనాలు వెళ్లాల్సిన మార్గం

*    గన్నవరం విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలు బెంజిసర్కిల్-కనకదుర్గ వారధి, తాడేపల్లి అండర్‌పాస్ రోడ్డు, ఎన్టీఆర్  కరకట్ట, న్యూ లాక్ జంక్షన్, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం మీదుగా భీష్మాచార్య రోడ్డు నుంచి     శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి.
*    హైదరాబాద్ నుంచి వైపు వచ్చే వాహనాలు నందిగామ, ఇబ్రహీంపట్నం, బెంజి సర్కిల్, కనకదుర్గ వారధి, ఇస్కాన్ దేవాలయం, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం మీదుగా భీష్మాచార్య రోడ్డు నుంచి ప్రాంగణానికి చేరుకోవాలి.
*    గుంటూరు వైపు నుంచి వాహనాలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మీదుగా ఖాజా టోల్ ప్లాజా, కేఎల్ యూనివర్సిటీ, భీష్మాచార్య రోడ్డు ద్వారా శంకుస్థాపన ప్రాంతానికి చేరుకోవాలి.

 ఏఏ, ఏ పాసులు ఉన్న వాహనాలు
*    గన్నవరం విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలు బెంజిసర్కిల్, కనకదుర్గ వారధి, ఉండవల్లి గుహల మీదుగా కరకట్ట రోడ్డుకు సమాంతరంగా కొత్తగా వేసిన భీష్మాచార్య రోడ్డు ద్వారా ప్రాంగణానికి చేరుకోవాలి.
*    హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు నంది గామ, ఇబ్రహీంపట్నం, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహల వద్ద బ్రిడ్జి మీదుగా కరకట్టకు సమాం తరంగా కొత్తగా వేసిన రోడ్డు ద్వారా చేరుకోవాలి.
*    గుంటూరు వైపు నుంచే వచ్చే వాహనాలు కాజా టోల్ ప్లాజా, కేఎల్ యూనివర్సిటీ, ఉండవల్లి గుహల వద్ద బ్రిడ్జి మీదుగా కరకట్టకు సమాంతరంగా వేసిన కొత్త రోడ్డు మీదుగా ప్రాంగణానికి చేరుకోవాలి.

సాధారణ సందర్శకులు
*    విజయవాడ నుంచి సాధారణ సందర్శకులను తీసుకువచ్చే బస్సులు, లారీలు కనకదుర్గ వారధి, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, యర్రబాలెం, మందడం గ్రామానికి ఎదురుగా కొత్తగా వేసిన బైపాస్ రోడ్డు మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి.
*    విజయవాడ వైపు నుంచి వచ్చే చిన్న వాహనాలు కనకదుర్గ వారధి, మంగళగిరి పాతబస్టాండ్, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, మల్కాపురం, మందడం, తాళ్లాయపాలెం రోడ్డు మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి.
*    తమిళనాడు, నెల్లూరు, ఒంగోలు వైపు నుంచి వచ్చే అన్ని వాహనాలు చిలకలూరిపేట, గుంటూరు బైపాస్ రోడ్డు, పెదకాకాని, తుళ్లూరు, మోదుగలంకపాలెం, వెలగపూడి బై పాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంతానికి చేరుకోవాలి.
*    కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు, హైదరాబాద్ నుంచి వచ్చే లారీలు, బస్సులు వినుకొండ, నర్సరావుపేట బైపాస్, ముప్పాళ్ల, సత్తెనపల్లి-నందిగామ అడ్డరోడ్డు, పెదకూరపాడు, అమరావతి, బోరుపాలెం, తుళ్లూరు బైపాస్,         రాయపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి.
*    హైదరాబాద్, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నందిగామ అడ్డరోడ్డు, పెదకూరపాడు, అమరావతి, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, బోరుపాలెం, మోదుగులలంక, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి.
*    కర్నూలు, కడప, అనంతపురం, హైదరాబాద్ నుంచి వచ్చే చిన్న వాహనాలు నర్సరావుపేట బైపాస్, ఫిరంగిపురం, పేరేచర్ల, పెదపరిమి, తుళ్లూరు, రాయపూడి, మోదుగలంకపాలెం మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VIPS  prakasam barrage  capital foundation  amaravati  

Other Articles