మహిళలు మేలుకున్నారు.. పురుషాధిక్య సమాజంలో అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్లను సరైన రీతిలో గుణపాఠం నేర్పుతున్నారు.. మరో స్త్రీపై కన్నెత్తి చూడకుండా ఉగ్రరూపం దాల్చుతూ తమ ప్రతికారం తీర్చుకుంటున్నారు. కానీ.. మరికొందరు మాత్రం ఆ ఆవేశంలోనే తప్పులు కూడా చేస్తున్నారు. ఓ వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక(13) అతడి కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. మాంసం ముద్దగా మారిన బాలుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండంతో ఈ దారుణం వెలుగు చూసింది.
లక్నోలో వుండే ఓ 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. తనని వదిలేయమని ఆ బాలిక ఎంతగా వేడుకున్నప్పటికీ.. అతగాడు వదిలిపెట్టలేదు. రెండుమూడుసార్లు ఆ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో రగిలిపోయిన ఆ బాలిక.. తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆ వ్యక్తిపై దాడిచేసేంత దేహబలం లేని ఆ బాలిక.. అతని కొడుకు అమిత్(5)ను హతమార్చాలని ఓ పథకం వేసుకుంది. బాధితురాలు వేసుకున్న పథకం ప్రకారం.. ఆ బాలుడ్ని ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లి దారుణంగా హత్య చేసింది. ఆ బాలుడి తల నరికి.. ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా రాళ్లతో చిధ్రం చేసింది. అనంతరం మృతదేహాన్ని పాలిథీన్ బ్యాగ్ లో చుట్టి కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మరునాడు ఆ మూటను కుక్కలు వీధిలోకి లాక్కొచ్చాయి. దీంతో సగం కాలిన మృతదేహపు శరీర భాగాలు బయటపడ్డాయి. ఆ దృశ్యాలను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు రంగంలోకి దిగి కూపీ లాగారు. చివరిసారిగా అమిత్తో ఉన్న బాలికను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. ఆమె నేరాన్ని అంగీకరించింది. బాలుని తండ్రి రింకూ.. తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తెలిపింది. అందుకు ప్రతీకారంగానే తాను ఈ హత్య చేసినట్టు ఒప్పుకుంది. దీంతో రింకూతోపాటు బాలికపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more