అతడో సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. పైగా పెళ్లికి ముందు ఎంతో మంచివాడిలా వ్యవహరించడంతో సమీప బంధువులు తమ అమ్మాయిని అతనికిచ్చి వివాహం జరిపించారు. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ తమ సంసార జీవితాన్ని సంతోషంగా సాగిస్తూ వచ్చారు. ఇందుకు గుర్తుగా వారికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. కానీ.. ఇంతలోనే భర్తలో దాగివున్న వున్న రాక్షసుడు మేలుకున్నాడు. మరో అమ్మాయిని వ్యామోహం పెంచుకున్న ఆ కర్కశుడు.. తన భార్యను వదిలించుకోవాలని ఓ పన్నాగం పన్నాడు. తన భార్యను వ్యభిచారిణిగా చిత్రీకరించే ప్రయత్నంలో ఆమె మొబైల్ నంబరును ఆన్‌లైన్ కాల్‌గర్ల్ జాబితాలో పెట్టాడు. చివరకు ఈ విషయం బయటకు పొక్కడంతో అతగాడు కటకటాల పాలయ్యాడు. పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన మురళి - భాగ్యలక్ష్మి ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. సమీప బంధువులు అయిన వారిద్దరికీ పెద్దలు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ఇంతలోనే మురళి మరో అమ్మాయిపై వ్యామోహం పెంచుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి తన ప్రేమవలలో పడేయడమే కాకుండా.. తన భార్య భాగ్యలక్ష్మికి తెలియకుండా ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు కూడా. కొద్దిరోజుల గడిచిన తర్వాత అతగాడికి మరో యువతిపై మోజుపడింది. ఇలా పలు అమ్మాయిలపై ఆ కర్కశుడు మోజు పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య భాగ్యలక్ష్మిని వదిలించుకునేందుకు ఆమె మొబైల్ నంబరును ఆన్‌లైన్‌లో కాల్‌గర్ల్ లిస్టులో ఉంచాడు. దీంతో ఆమె ఫోన్ నంబరుకు అనేక మంది ఫోన్లు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో భర్త, అత్త ఉమావతి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.
ఓవైపు వరుసగా ఫోన్లు రావడం, మరోవైపు అత్తారింట్లో వేధింపులు పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురైన భాగ్యలక్ష్మి.. తన దుస్థితిని అన్నకు వివరించింది. వారి సాయంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మొబైల్ నంబరును ఎవరు కాల్‌గర్ల్ జాబితాలో పెట్టోరో.. ఎక్కడ పెట్టారో ఐపీ అడ్రస్ ద్వారా ఆరా తీశారు. ఇందులో మురళీ వినియోగించే కంప్యూటర్ నుంచే అప్ చేసినట్టు పోలీసులు నిర్ధారించుకుని.. మురళిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more