ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పరస్పరం విసురుకుంటున్న సెటైర్లు జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. మోడీపై నితీశ్ పేరడీ సాంగ్ పాడారు. ఆ పాటకు మూలం 'త్రీ ఇడియట్స్' నుంచి స్వీకరించారు. దాన్ని ఆధారంగా తీసుకొని మోడీ తనదైన శైలిలో నితీశ్ 'త్రీ ఇడియట్స్'ను ఎందుకు ఎంచుకున్నారంటూ సెటైర్ వేశారు. జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని త్రీ ఇడియట్స్‌తో పోల్చారు. ముషాయిరా కళను పరిపూర్ణంగా నేర్చుకోవాలని, బీహార్ ఎన్నికలు పూర్తయిన తర్వాత విరామ సమయంలో సాధన చేయాలని సలహా ఇచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ జనానికి వినోదం పంచుతున్నారని, చాలా కాలం తర్వాత బీహార్‌కు ఎంటర్ టెన్ మెంట్ లభిస్తోందని మోడీ అన్నారు. కానీ ఇటీవల లాలూజీ, నితీశ్‌జీ మధ్య నేరస్థులను కాపాడటం, బంధుప్రీతి వంటి విషయాల్లో శత్రుత్వం నడుస్తోందన్నారు. ఇప్పుడు వినోదం పంచడంలో కూడా ఇద్దరూ పోటీ పడుతున్నారన్నారు.
బీహార్ ఎన్నికల్లో విమర్శలను కామెడీ యాంగిల్ లో నాయకులు పండిస్తున్న తీరు బీహార్ ఓటర్లకు కొత్తగా.. మీడియాలో వార్తలుగా వస్తున్నాయి. ''నిన్న నితీశ్‌జీ ముషాయిరా గానం విన్నాను. కొత్త తరహా వినోదాన్ని ప్రారంభించి లాలూను ఓడించాలని ఆయన అనుకుంటున్నారు. మహా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ అనే ముగ్గురు భాగస్వాములున్నారు. నితీశ్‌జీ తన మొదటి ముషాయిరా కోసం త్రీ ఇడియట్స్ సినిమాను ఎంచుకోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పేరడీ సాంగ్ చేయాలనుకున్నా సరే, త్రీ ఇడియట్స్‌నే ఎంచుకోవాలని ఎందుకనిపించింది మీకు?'' అని మోడీ అన్నారు. ''ఎంత గొప్ప ఎంటర్ టెన్ మెంట్ నితీశ్ బాబు! మీకింకా మరో వారం టైం ఉంది... దీన్ని పాడుకుంటూ గడపండి... నలుగురైదుగురు వందిమాగధులను పిలుచుకొని ముషాయిరా వినిపించండి'' అన్నారు. మీ భవిష్యత్తు కోసం ఎవరిని నమ్మాలో మీరే నిర్ణయించుకోవాలని ఓటర్లకు తెలిపారు. మీ భవిష్యత్తును మార్చగలిగేది ఏదైనా ఉందీ అంటే అది కేవలం అభివృద్ధి మాత్రమేనని చెప్పారు. ఒకవైపు అభివృద్ధి, మరో వైపు అవకాశవాదం ఉన్నాయన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more