నిర్భయ ఘటన తర్వాత భారత ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు. నిర్భయకు జరిగిన అన్యాయం మీద అందరూ ప్రతిఘటించారు.. అయితే దాని తర్వాత ప్రభుత్వాలు అత్యాచారం చేసిన వాళ్లు భయపడేలా కొత్త చట్టాలను తీసుకువస్తామని హామీలిచ్చాయి. కానీ అది అమలులోకి మాత్రం రాలేదు. అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్ష వెయ్యాలని ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తోంది కానీ ప్రభుత్వాలు మాత్రం దాన్ని పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా అత్యాచారాలు జరిగితే మాత్రం దాన్ని ఖండిస్తున్నాం... నీచం.. అదీ ఇదీ అంటూ స్టేట్ మెంట్ లు ఇచ్చి.. తమ సానుభూతిని ప్రకటిస్తారు. మరి దీనికి పరిష్కారం ఏంటి.? మగతనం లేకుండా చెయ్యడం. మరోసారి అత్యాచారం చేద్దామన్నా.. ఏమీ చెయ్యలేని పరిస్థితి.. మరో అమ్మాయికి అత్యాచార బాథ తప్పేందుకు మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన సంచలన తీర్పు మీద యావత్ బారత్ చర్చిస్తోంది.
మగతనం లేకండా చెయ్యడం నిజంగా అత్యాచార నిందుతులకు సరైన శిక్షనేనా..? వారికి ఆ శిక్ష ఎంత వరకు కరెక్ట్ అన్న దాని మీద సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది. నపుంసకుడిగా చెయ్యడం అంటే క్యాస్ట్రేషన్ మీద సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. నిజానికి అత్యాచారం చేసిన వారికి చాలా సార్లు విధించే ఆటవిక శిక్ష ఇది. చాలా సార్లు ప్రజలు కలిసి అత్యాచారం చేసిన వారి మగతనాన్ని నాశనం చేస్తుంటారు. అయితే ఇలాంటి శిక్షను అమలు చెయ్యాలని ఇండియాలో ఎప్పటి నుండో డిమాండ్ వినిపిస్తున్నా కానీ అందుకు సరైన వేదిక, సమయం దొరకలేదు. మద్రాస్ హైకోర్ట్ తీర్పుతో తాజాగా తీర్పునిస్తూ.. అత్యాచారం చేసిన వారికి క్యాస్ట్రేషన్ చెయ్యాలని జడ్జ్ మెంట్ ఇచ్చింది. మరి మద్రాస్ కోర్ట్ ఇచ్చిన తీర్పు కరెక్టేనా...? దేశంలొ ఇలా క్యాస్ట్రేషన్ చేస్తే రేప్ లు తగ్గుతాయా..? అత్యాచారం చేసిన వారికి క్యాస్ట్రేషన్ సరైన శిక్షనేనా..? ఇలా చాలా అంశాల మీద చర్చ సాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more