lalu prasad is Duplicate yadav

Lalu prasad is duplicate yadav

Bihar, lalu Prasad Yadav, Pappu Yadav, Bihar Elections, Duplicate yadav

Bihar Ex Cm Lalu Prasad is Duplicate Yadav. Jan Adhikar Party President Pappu Yadav slams Lalu prasad as Duplicate yadav.

లాలూ యాదవ్ కాదట.. నకిలీ యాదవ్ అంట..!

Posted: 10/29/2015 01:33 PM IST
Lalu prasad is duplicate yadav

బీహార్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నిన్నటి దాకా మోదీ, నితీష్, లాలూ ప్రపాద్ యాదవ్ లు కేంద్రంగా విమర్శలు ప్రతివిమర్శలు వస్తుంటే.. సందట్లో సడేమియాలాగా చిన్న పార్టీలు అన్నీ తమశక్తి వరకు ప్రచారం చేసుకున్నాయి. బీహార్ ఎన్నికల్లో అందరి కన్నా కామెడీ కింగ్ లాలూ ప్రసాద్ వేసిన కౌంటర్లు అన్నీ ఇన్నీ కాదు. అయితే ఎదుటి వాళ్లను తన మాటలతో ఆడుకునే.. లాలూ మీదనే విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు లాలూ ప్రసాద్ యాదవ్ యాదవ్ కాదు.. నకిలీ అని అంటున్నారు యాదవ నేత పప్పూ యాదవ్. సందట్లో సడేమియాలా లాలూ మీద చేసిన పప్పూ యాదవ్ మాటలు సంచనానికి తెర తీశాయి.

లాలూ ప్రసాద్ యాదవ్ ను 'నకిలీ యాదవ్' అని పేర్కొన్న పప్పు యాదవ్ తానే నిజమైన యాదవుడనని ప్రకటించుకున్నారు. బీహార్ రాజకీయ నేతల్లో అత్యంత క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న పప్పూ యాదవ్ గతంలో ఆర్జేడీ నేతగానే ఉన్నారు. అంతేకాక లాలూ ప్రసాద్ కు అత్యంత సన్నిహితుడిగానూ పేరుగాంచారు. తాజాగా లాలూతో విభేదించిన పప్పూ యాదవ్, జన్ అధికార్ పార్టీ పేరితో సొంత కుంపటి పెట్టుకుని బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. యాదవులు ఎక్కువగా ఉండే ఏరియాల మీద పప్పూ యాదవ్ దృష్టిసారించారు. కాగా తాజాగా లాలూ మీద చేసిన వ్యాఖ్యలు పప్పూను ఈ ఎలక్షన్ లో హైలెట్ గా నిలుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  lalu Prasad Yadav  Pappu Yadav  Bihar Elections  Duplicate yadav  

Other Articles