Finally Harbhajan Singh Ties Knot With eeta Basra After 5 Years Dating | Punjabi Tradition Marriages

Harbhajan singh ties knot with eeta basra after 5 years dating

Harbhajan Singh marriage, Harbhajan Singh geeta basra, Harbhajan Singh ties knot geeta basra, sachin tendulkar in Harbhajan Singh marriage, sachin family in Harbhajan Singh marriage

Harbhajan Singh Ties Knot With eeta Basra After 5 Years Dating : India cricketer Harbhajan Singh and Bollywood actress Geeta Basra finally tied the knot on Wednesday in Jalandhar.

ఘనంగా జరిగిన హర్భజన్-గీతా బస్రాల పెళ్ళి

Posted: 10/29/2015 06:59 PM IST
Harbhajan singh ties knot with eeta basra after 5 years dating

టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతా బస్రాల వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. పంజాబీ సంప్రదాయంలో ఫగర్వాలో వున్న గురుద్వారాలో వీరిద్దరి వివాహం ఎంతో ఘనంగా అయ్యింది. గత ఐదేళ్లుగా తమ ప్రేమాయణాన్ని నడిపిన భజ్జీ, గీతా ఇద్దరు.. చివరికి ఈ పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు, సన్నిహితులతోపాటు క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి అంజలి కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకల్లో సచిన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.

నవంబర్ 1న ఢిల్లీలో భజ్జీ-బాస్రా  వివాహ రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశముంది. క్రికెటర్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా తదితర ప్రముఖులు రిసెప్షన్ కు రానున్నారు. వీరితోపాటు ఇంకా చాలామంది ఈ రిసెప్షన్ ని హాజరు కానున్నారని తెలిసింది. అటు భజ్జీ కూడా ఇప్పటికే రిసెప్షన్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నాడట. ఈ ఈవెంట్ చిరకాలంగా గుర్తుండిపోయేలా భారీ వ్యయం వెచ్చించి, ఎంతో వైభవంగా జరపనున్నాడని తెలిసింది. ముఖ్యంగా తనతో కలిసి ఆడిన క్రికెటర్ల కోసం భజ్జీ స్పెషల్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు.. వీరి శుభాకాంక్షలు తెలుపుతూ రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ట్వీట్లు చేశారు.

ఇదిలావుండగా.. ఈ పెళ్లిలో భజ్జీ తెలుపు రంగు షెర్వానీ, ఎరుపు టోపీ ధరించి మెరుశాడు. అలాగే.. పంజాబీ సంప్రదాయం ప్రకారం చేతిలో తల్వార్ ని కూడా పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చాడు భజ్జీ. ఇక పెళ్లికూతురు సంప్రదాయ ఎరుపు రంగు చీర ధరించింది. ఈ పెళ్లికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆ చీరలో గీతా బస్రా అందాల సుందరిలా వెలిగిపోయిందంటూ ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ఈ పెళ్లికిముందు హర్భజన్ నివాసంలో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles