సినిమా డైలాగ్ లు వాడుకోవడం.. సినిమాలోని పాటలను వాడుకోవడం ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలకు బాగానే అలవాటైంది. తాజాగా జరుగుతున్న బీహార్ ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు కాస్త మసాలా అద్దుతూ.. సినిమా లిరిక్స్ వాడుతున్నారు.. సినిమా ఫ్లేవర్ అను ఎన్నికల ర్యాలీల్లో యాడ్ చేస్తూ అందరికి ఆశ్చర్యాన్ని, వినోదాన్ని పంచుతున్నారు. బీహార్ సిఎం నితీష్ కుమార్ ఓ సినిమాలోని పాటలోని లిరిక్స్ కు మోదీ మీద పేరడీగా మార్చి.. సభలో నవ్వులు పూయించారు. అలాగే మోదీ కూడా దానికి కౌంటర్ గా జెడియు, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని త్రీఇడియట్స్ తో పోల్చారు. అయితే ఇలా నడుస్తున్న మాటల తూటాలను కొనసాగిస్తూ.. రాహుల్ గాంధీ కూడా అందులో జాయిన్ అయ్యారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ మోదీ చెప్పిన త్రీఇడియట్స్ మీద కౌంటర్ వేశారు. మోదీగారి ధన్యవాదాలు... మా కూటమి ఆయన సభల్లో బాగా ప్రచారం చేస్తున్నారు... ఆ సినిమా హిట్ అయింది.. అలాగే బీహార్ ఎన్నికల్లో మా కూటమి కూడా హిట్ అవుతుందని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీగారి మాయ మాటలు.. ఇక చెల్లవని. ఎంత కాలం ఇలా మాటలు చెబుతారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని కాబట్టే ఇలా త్రీ ఇడియట్స్, షైతాన్ అంటున్నారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more