finally police caught the most wanted criminal balamurugan with the help of dangerous disease | bank robber murugan

Police caught most wanted criminal balamurugan with the help of dangerous disease

bala murugan, bank robber bala murugan, most wanted criminal bala murugan, bala murugan latest updates, bala murugan caught by police, bala murugan aids diseasse, bala murugan crime stories

police caught most wanted criminal balamurugan with the help of dangerous disease : finally police caught the most wanted criminal balamurugan with the help of dangerous disease

ఆ ‘వ్యాధి’.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టించింది!

Posted: 10/30/2015 03:41 PM IST
Police caught most wanted criminal balamurugan with the help of dangerous disease

ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పేరు బాలమురుగన్.. బ్యాంకులను దోపిడీ చేయడమే అతని పని. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు బ్యాంకులను దోపిడీ చేసిన ఇతగాడ్ని పోలీసులు పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు కానీ.. అతగాడు చాకచక్యంగా తప్పించుకోగలిగాడు. వెంట తన భార్య, ఓ కుక్కతో కలిసి ఇన్నోవా వాహనంలో తిరిగే ఈ క్రిమినల్ నిపుణుడైన డ్రైవర్ కావడంతో చాలాసార్లు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. ఇంత తెలివిగలవాడైన ఈ క్రిమినల్ గతకొన్నాళ్ల నుంచి ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధే అతడ్ని పోలీసులకు పట్టించింది. ఎట్టకేలకు బాలమురుగన్ దొరకడంతో.. చాలాకాలం నుంచి గాలిస్తున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సైబరాబాద్ పరిధిలోని బ్యాంకుల్లో దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న బాలమురుగన్ కోసం గత జనవరినుంచి పోలీసులు గాలిస్తున్నారు. కొంతకాలం క్రితం చెన్నైలో తన అనుచరుడు దినకర్ తో కలిసి మేనల్లుడి ఫ్లాట్ లో వుంటున్నాడని తెలుసుకున్న పోలీసులు.. దాడి చేసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే.. సమాచారం తెలుసుకున్న ఆ క్రిమినల్.. చిటికెలో తప్పించుకుని పరారయ్యాడు. అతను వున్న ఫ్లాట్ లో తనిఖీలు చేయగా.. బాలమురుగన్ ‘ఎయిడ్స్’ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. దీంతో తమకు పెద్ద క్లూ దొరికినట్లైందని పోలీసులు కాస్త రికాల్స్ గా ఫీలయ్యారు. తన వ్యాధికి చికిత్స పొందేందుకు ఏదైనా ఆసుపత్రికి రావచ్చని భావించిన పోలీసులు... అన్ని రాష్ట్రాల్లోని హచ్ఐవీ కేంద్రాలకు బాలమురుగన్ కు సంబంధించిన పూర్తి వివరాలతో సహా చిత్రాలను పంపారు. కొన్నాళ్లు ఓపికతో వున్న పోలీసులు.. ఏదైనా ఓ హాస్పిటల్ వస్తాడని వెయిట్ చేయడం ఆరంభించారు. ఆ సమయం రానే వచ్చింది. కర్ణాటకలోని తిరువరూర్ చికిత్సా కేంద్రానికి ఆ క్రిమినల్ వచ్చినట్లు సమాచారం అందగా.. పోలీసులు వెంటనే రంగంలోకి బాలమురుగన్ ను అరెస్ట్ చేశారు.

ఇదిలావుండగా.. బాలమురుగన్ కి సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లుగప్పి దాచుకున్న ఈ క్రిమినల్ అల్లుడు సినీ హీరో అని తెలిసింది. అతని చిత్రం ప్రారంభోత్సవానికి ఓ డీసీపీ స్థాయి అధికారి కూడా క్లాప్ కొట్టాడట. దీంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏదైతేనేం.. చివరికి బాలమురుగన్ దొరకడంతో పోలీసు అధికారులు కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bank robber bala murugan  aids disease  police investigation  

Other Articles