Modi questions who is she

Modi questions who is she

Modi, Elections, Bihar, Nitesh Kumar, Sonia gandhi, BJP, Bihar Polls

PM Narendra Modi questions that who is she. In a sharp counter-attack on Nitish Kumar over his “outsider” jibe at him, Prime Minister Narendra Modi today asked him whether he would call Congress chief Sonia Gandhi also a ‘bahri’, asserting that he was not a PM of another country.

ఆమె ఎవరు...? సభలో ప్రశ్నించిన మోదీ

Posted: 10/30/2015 04:26 PM IST
Modi questions who is she

బీహార్ లో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మోదీకి, నితీష్ కు మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మోదీ మీద ఏకంగా పాట పాడిని నితీష్ అందరిని ఆశ్చర్యపరిచారు. బీహార్ లో త్రీ ఇడియట్స్ అంటూ జెడియు, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలనుద్దేశించి వ్యాఖ్యానించారు మోదీ. కాగా బయటి నుండి వచ్చిన వ్యక్తిని బయటకే తరిమివెయ్యాలంటూ... బీహారీ.. బాహారీ అంటూ నితీష్ మోదీని విమర్శించారు. కాగా మోదీ ఇందుకు బదులిచ్చారు. తనను బాహారీ అన్న దాని మీద కౌంటర్ వేశారు. తాను దేశానికి ప్రధాన మంత్రిని అని.. అలాంటిది మరి బాహారీ ఎందుకు అవుతానని ప్రశ్నించారు. సరే నేను బయటి వ్యక్తినే మరి ఆమె ఎవరు అని నితీష్ ను ప్రశ్నించారు మోదీ.

నేను బయటి వ్యక్తిని అయితే సోనియా గాంధీ ఎవరని ఆయన ప్రశ్నించారు. సోనియా గాంధీ ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆమెను బాహారి అంటారా లేదా బిహారి అంటారా? దేశానికి నేను ప్రధానమంత్రిని కాదా, బిహార్ రాష్ట్రం ఇండియాలో లేదా, నేను ఎలా బయటి వ్యక్తిని అవుతాను అని మోదీ ప్రశ్నించారు.బిహార్ ఓటర్లకు ఒక విషయం చెప్పడానికి నేను ఇక్కడకు వచ్చాను. మీరు నన్ను నమ్మండి. లోక్ సభ ఎన్నికల్లో నాపై విశ్వాసం ఉంచారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ నామీద నమ్మకం ఉంచండి. రాష్ట్రంలో అవినీతిని అంతంచేసి చూపిస్తా' అని మోదీ పేర్కొన్నారు. బిహార్ ను దోచుకున్న వారిని శిక్షించాలని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Elections  Bihar  Nitesh Kumar  Sonia gandhi  BJP  Bihar Polls  

Other Articles