a britain man named daniel took 35 viagra pills when he was drunk to have romance with his girlfriend | viagra problems

Britain man take 35 viagra pills when he was drunk to have romance with girlfriend

viagra problems, britain man took 35 viagra pills, viagra erection, husband affair girlfriends, man face problems after took 35 viagra pills, viagra controversies

britain man take 35 viagra pills when he was drunk to have romance with girlfriend : a britain man named daniel took 35 viagra pills when he was drunk to have romance with his girlfriend, Left With Five-Day Erection And Hallucinations

35 వయాగ్రా బిళ్ళలు మింగాడు.. 5 రోజులు అవస్థ పడ్డాడు!

Posted: 10/30/2015 05:44 PM IST
Britain man take 35 viagra pills when he was drunk to have romance with girlfriend

అంగస్తంబన సమస్యను పరిష్కరించేందుకు ‘వయాగ్రా’ మాత్రల్ని కనిపెట్టగలిగారు. ఆ సమస్యతో ఎవరైతే బాధపడుతుంటారో వారికి ‘వయాగ్రా’ దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలా అని ఒకేసారి చాలామాత్రలు వేసుకోకూడదు సుమా! డాక్టర్ల సూచనమేరకు పరిమితంగా వాడాలి. అలాకాకుండా మితిమీరి వాడితే.. ఎంత నరకం అనుభవించాల్సి వస్తుందో ఓ వ్యక్తి ప్రత్యక్షంగా అనుభవించి అందరికీ సూచనలా నిలిచాడు.

బ్రిటన్‌కు చెందిన 36 ఏళ్ల డేనియల్‌ మెడ్‌ఫోర్త్‌ కి అప్పుడప్పుడు వయాగ్రా వాడే అలవాటు వుంది. అతడికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. అయినప్పటికీ ఇతగాడు మరో ప్రియురాల్ని మెయింటేన్ చేస్తున్నాడు. భార్యతో గొడవపడినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్ళి సేదతీరుతుంటాడు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల కిందట ఒక సెలవు రోజున ఆఫీస్ వుందంటూ భార్యకు అబద్ధం చెప్పి తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ చిత్తుగా తాగేశాడు. ఆ మత్తులోనే ఏకంగా 35 వయాగ్రా బిళ్లలు వరసగా మింగేశాడు. ప్రియురాలితో కాసేపు శృంగారంలో పాల్గొన్నాడు. అయితే.. కాసేపటికి అతడికి కళ్లు తిరగడంతోపాటు రకరకాల భ్రాంతులు కలగడం మొదలైంది. అంగస్తంభన జరిగి ఎంతసేపయినా పోవడం లేదు. దీంతో కంగారుపడ్డ మెడ్‌ఫోర్త్‌ వెంటనే ఇంటికి చేరుకుని తన భార్యకు జరిగిన విషయం చెప్పాడు. ఆమె మొదట కోపగించుకున్నా.. ఆ తర్వాత అలక మాని ఆంబులెన్స్ కు ఫోన చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన అనంతరం అక్కడ ఇతని పరిస్థితి చూసి డాక్టర్లు, నర్సులు నవ్వేసుకున్నారు.. కుళ్లు జోకులు వేసుకున్నారు. ఇంతలోనే తేరుకుని అతడికి చికిత్స అందించారు. ఎంత ప్రయత్నించినా 5 రోజుల వరకూ అతడి అంగ స్తంభనను తగ్గించలేకపోయారు.

ఎట్టకేలకు 5 రోజుల ఆ తర్వాత ఆ సమస్య తగ్గిందని మెడ్ ఫోర్త్ ఇంటికెళ్తే.. ప్రతి చిన్న రాపిడికీ అంగ స్తంభన కలిగేదనీ, దానితో ఎన్నో రోజులపాటు చాలా ఇబ్బంది పడ్డానని అతడు వివరించాడు. ఇంత బాధలోనూ తన భార్య తనను క్షమించడమే తనకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్పాడు. అలాగే.. తనకు చికిత్స అందించిన ఆసుపత్రి సిబ్బందికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఇదిలావుండగా.. వయాగ్రా ఎక్కువైతే హృదయ స్పందన లయ తప్పడం, గుండె నొప్పి, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. అంగ స్తంభన జరిగి ఎప్పటికీ అలాగే ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది. దానికి 24 గంటల్లో చికిత్స చేయకపోతే అంగం శాశ్వతంగా దెబ్బతినవచ్చని, కొలంబియాలో 66 ఏళ్ల ఒక వ్యక్తికి ఇదే కారణంతో అంగాన్ని తొలగించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : viagra problems  britain man took 35 viagra pills  

Other Articles