Everyone is Smiling in This Part of Andhra Pradesh

Everyone is smiling in this part of andhra pradesh

Andhra pradesh, Amaravati, Guntur, Amaravati people, AP, Chandrababu Naidu, AP capital, Real Estate, Land rates in Amaravati

There is a real estate boom in Thullur Mandal, Guntur district, Andhra Pradesh. Also, a real estate agent boom. Ever since the state's new capital Amaravati was announced in this region, real estate prices have zoomed. Land deals worth crores are being struck in bare-bone offices, some as basic as a shed with an asbestos roof, a table and a couple of chairs, a telephone connection and some documents.

ఆ ఊళ్లు నవ్వుతున్నాయి.. కారణం చంద్రబాబు

Posted: 10/31/2015 12:08 PM IST
Everyone is smiling in this part of andhra pradesh

ఇలా చదవగానే.. ఏంటీ చంద్రబాబు నాయుడు ఏమైనా లాఫింగ్ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారా అనే అనుమానం వచ్చిందేమో అస్సలు కాదు. ఎందుకంటే తీరికలేనంత పనితో చంద్రబాబు నాయుడు చాలా బిజీగా ఉన్నారు. మరి ఊర్లు నవ్వుతున్నాయి అని ఎందుకు రాశారు అన్న అనుమానానికి సమాధానం ఉంది. ఏపి రాష్ట్రానికి ప్రస్తుతానికి రాజధాని లేదు. కనీసం రాజధాని కూడా లేకుండా ప్రత్యేక రాష్ట్రంగా విభజింబడింది. అయితే కొత్తగా ఏర్పడటం.. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో చాలా కష్టాల్లో ఉంది ఏపి. అయితే ఏపి రాజధాని అమరావతి నిర్మాణానికి అంతా సిద్దమైంది. అలా అమరావతి ప్రకటననే చాలా గ్రామాల్లో ఆనందాన్ని తీసుకువచ్చింది. చాలా మంది గ్రామస్తులు చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎంతో మంది జీవితాల్లో కూడా మార్పులు వచ్చాయి. {}{}

అమరావతి పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం ఆనందం తాండవిస్తోంది. నిన్నటి దాకా ఏదో చిన్న చిన్న వృత్తులు చేస్తూ కాలాన్ని వెల్లదీసిన గ్రామస్తులు ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. రైతులు వ్యవసాయాన్ని కూడా వదిలేసి.. కాస్త పరిచయాలు ఉంటే చాలు.. రియల్ దందా మొదలుపెడుతున్నారు. రోజుకు వెయ్యి రూపాయలు కూడా సంపాదించలేదని కూలీలు కూడా రియల్ ఎస్టేట్ దందా చేస్తూ.. లక్షల రూపాయలు కమీషన్ల రూపంలో సంపాదిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అంటే తమ దేవుడని వారంటున్నారు. అమరావతి గ్రామాల్లో ల్యాండ్ ధర మామూలు కన్నా ఇరవై రెట్లు పెరగడం విశేషం. మొత్తానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న అమరావతి నిర్ణయం ఎంతో మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles