India has decided to send Karachi’s ‘runaway boy’ Mohammad Ramzan, as a ‘return gift’ back to Pakistan for returning Geeta | bajrangi bhaijan

India to send pakistani boy ramzan home as gift for returning geeta

pakistani boy ramzan, geeta story, pak girl geeta, pak boy ramzan, bajrangi bhaijan real stories, india to send pakistani boy ramzan

India to send Pakistani boy ramzan home as gift for returning geeta : India has decided to send Karachi’s ‘runaway boy’ Mohammad Ramzan, as a ‘return gift’ back to Pakistan for returning Geeta.

‘గీత’లాగే పాక్ అబ్బాయి ‘బజరంగీ భాయిజాన్’ స్టోరీ

Posted: 10/31/2015 12:10 PM IST
India to send pakistani boy ramzan home as gift for returning geeta

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ సినిమా విడుదలైనప్పటి నుంచి ఆ సినిమా స్టోరీ తరహాలోనే నిజమైన ఘటనలు వెలుగులోకి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ నుంచి తప్పిపోయి పాకిస్థాన్ చేరిన ‘గీత’ కథ బయటకొచ్చింది. నిజానికి ఆ సినిమా రాకముందే గీత వ్యవహారం నడుస్తున్నప్పటికీ.. సినిమా రిలీజ్ అయిన అనంతరం అది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏదైతేనేం.. దాదాపు 14 సంవత్సరాల తర్వాత గీత స్వదేశానికి తిరిగొచ్చేసింది. ఇప్పుడు ఈమెలాగే మరో పాక్ అబ్బాయి కథ వెలుగులోకొచ్చింది. చాలాకాలం పాకిస్థాన్ నుంచి తప్పిపోయి భారత్ కు చేరిన రమాజాన్ అనే అబ్బాయి.. ఇన్నాళ్లకు తిరిగి పాక్ లో వున్న తన తల్లి చెంతకు చేరుకోబోతున్నాడు.

రమాజాన్ తల్లిదండ్రులు 2004లో విడిపోయారు. రమాజాన్ తండ్రి తన భార్యకు చెప్పకుండా అతన్ని బంగ్లాదేశ్ తీసుకుపోయాడు. అక్కడ తండ్రి, సవతి తల్లి వేధింపులు భరించలేక రమాజాన్ భారత్కు 2008లో పారిపోయి వచ్చాడు. అలా వచ్చిన రమాజాన్ కూటికోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇతరుల సహాయార్థం కోసం అర్థించాడు. తన తల్లి దగ్గరికి తిరిగి చేరుకోవాలని దేశంలోని చాలా రాష్ట్రాలు చక్కర్లు కొట్టాడు. చివరికి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని చైల్డ్లైన్ చారిటీ రెండేళ్ల క్రితం రమాజాన్ను గుర్తించి చేరదీసింది. అటు.. కరాచీలో ఉంటున్న రమాజాన్ తల్లి రజియా బేగం తన కొడుకు కోసం గాలిస్తూ వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొడుకు దొరక్కపోవడంతో కుంగిపోయిన ఆ తల్లి.. ఆర్నెళ్ల క్రితం అతని ఫొటోలను ఇంటర్నెట్లో పెట్టి జరిగిన సంగతిని వెల్లడించింది. చివరకు.. ఆమె తన కుమారుడి ఆచూకీ తెలుసుకుంది. భోపాల్ లో చైల్డ్లైన్ చారిటీలో తన కొడుకు వున్నాడని తెలుసుకున్న ఆమె.. వెంటనే ఆ చారిటీ యాజమాన్యాన్ని సంప్రదించింది. 'చాలా ఏళ్లుగా నా కొడుకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పటికైనా నా కొడుకును నా దగ్గరకు చేర్చండి' అని రజియా వేడుకుంది.

తల్లి గురించి రమాజాన్ కు చెప్పగా.. అతడు తన తల్లిని గుర్తించాడని, రోజు ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్నాడని చైల్డ్లైన్ చారిటీ డైరెక్టర్ అర్చనా సహాయ్ చెప్పారు. గత సెప్టెంబర్ నుంచి తల్లికొడుకులిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు చారిటీవారు పేర్కొన్నారు. ఇక అమ్మతో ఫోన్లో మాట్లాడిన రమాజాన్.. 'అమ్మతో మాట్లాడినపుడు ఇద్దరం ఏడ్చేశాం. వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లాలని ఉంది. అమ్మతో కలసుండాలని ఉంది. గీత మాదిరిగా నన్నూ పాకిస్థాన్కు పంపుతారు' అని అన్నాడు. రమాజాన్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అర్చనా సహాయ్ చెప్పారు. ఈ కుర్రాడిని పాక్కు పంపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, పాక్ అభ్యర్థన కోసం వేచి చూస్తోందని తెలిపారు. రమాజాన్ను స్వదేశం తీసుకురావడానికి పాక్లోని చారిటీ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు కృషి చేస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistani boy ramzan  geeta story  bajrangi bhaijan real stories  

Other Articles