శీలం ఎవరికైనా ముఖ్యమే. అయితే ఆడవారి శీలానికి ఇచ్చిన విలువ మగవారి శీలానికి ఇవ్వలేదు చైనా న్యాయ సూత్రాలు. ఇకపై మగవారిపై జరిగే అత్యాచారాల విషయంలో కూడా చైనా కోర్టులు తీవ్రంగా ప్రతిస్పందించనున్నాయి. ఆడవారిపైనే కాదు మగవారిపై రేప్ చేసినా, లైంగిక దాడికి ప్రయత్నించినా జైలు శిక్ష తప్పదని చైనా ప్రభుత్వం చట్టంలో సవరణ చేసింది. దేశంలో పురుషులపై లైంగిక దాడులు, వేధింపులు పెరిగిపోతున్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. వీటిని అరికట్టాలని వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని సమీక్షించిన ప్రభుత్వం.. చట్టంలో సవరణ చేసింది.
ఇప్పటివరకు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినవారికి మాత్రమే జైలు శిక్ష విధించేవారు. ఇక, పురుషులపై లైంగిక దాడికి పాల్పడితే అది ఆడవారైనా, మగవారైనా ఐదేండ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని చట్టంలో చైనా సర్కారు పొందుపర్చింది. అత్యాచారాలు అనగానే చాలా వరకు మగవాళ్లు ఆడవాళ్లను మాత్రమే చేస్తారు అనే భావన ఉంది. కానీ మగవాళ్ల మీద కూడా అత్యాచారాలు చాలా వరకు వెలుగులోకి రాకుండా ఉంటున్నాయి. అయితే చైనా ప్రభుత్వం మొదటిసారి మగవారి మీద జరిగే అత్యాచారాల మీద కూడా తీవ్రంగా స్పందించేలా మార్పులు తీసుకువచ్చింది. చాలా సార్లు మగవారి మీద మగవారే అత్యాచారానికి పాల్పడుతున్న నేపధ్యంలోనే చైనా ఇలాంటి కొత్త మార్పులు తీసుకువచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more