they Lecturing Us on Tolerance on 1984 Riots Anniversary

They lecturing us on tolerance on 1984 riots anniversary

Modi, Lalu prasad, Congress, Sonia Gandhi, Narendra Modi, Nitesh Kumar, Bihar elections, Bihar, Bihar Polls

Prime Minister Narendra Modi addressed a rally in Purnea district of Bihar. People who are in power,it's their responsibility to give account of their work,Lalu ji ruled for 15 years,Chhota bhai (Nitish Kumar) ruled for 10 years. The list of leaders is so long that all the time will go in taking their names

మీరు నీతులు చెబుతారా..? మోదీ

Posted: 11/02/2015 01:07 PM IST
They lecturing us on tolerance on 1984 riots anniversary

ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ మీద మండిపడ్డారు. మీరా మాకు పాఠాలు చెబుతున్నది.. నీతులు చెప్పడానికి మీకు అర్హత లేదు అంటూ విమర్శించారు. దేశంలో జరుగుతున్న హింస మీద, తన మీద పిర్యాదు చెయ్యడానికి కాంగ్రెస్ వెళ్లిందని మోదీ వెల్లడించారు. బీహార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పనిలో పనిగా నితీష్ మీద, లాలూ ప్రసాద్ ల మీద కూడా విమర్శలు గుప్పించారు. 1984 నవంబర్ 2 తేదీని దిల్లీలో కాంగ్రెస్ చేసిన ఘోరం దేశానికి తెలుసునని అన్నారు. అమాయకులైన సిక్కులను కాంగ్రెస్ పొట్టనబెట్టుకుందని మండిపడ్డారు. అదే నవంబర్ 2 తేదీన తనకు నీతులు చెబుతోందని కాంగ్రెస్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీహార్ లో రెండు దీపావళులు రానున్నాయని మోదీ వెల్లడించారు. ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని కానీ నితీష్ కుమార్ దాన్ని మరిచిపోయారని అన్నారు. నితీష్ కుమార్ అందరికి విద్యుత్ మీద ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే నితీష్ అది అమలు చెయ్య లేదని.. కానీ తమ ప్రభుత్వం వస్తే అందరికి విద్యుత్ అందిస్తామని అన్నారు. బీహార్ ఎన్నికల సందర్భంగా అందరూ రకరకాల నాటకాలు ఆడుతున్నారని.. కానీ ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని అన్నారు. నవంబర్ 8న బీహార్ లో రెండు దీపావళులు వస్తాయని అన్నారు. బీహార్ ప్రజలు బిజెపి పార్టీకి మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Lalu prasad  Congress  Sonia Gandhi  Narendra Modi  Nitesh Kumar  Bihar elections  Bihar  Bihar Polls  

Other Articles