Thank you Pakistan for calling us a terror organisation

Thank you pakistan for calling us a terror organisation

pakistan, India, Shivasena, uddhav thackeray, Mumbai, Pakistan govt, shivasena in Mumbai

A couple of days after Pakistan urged the international community to take notice of "terrorist activities of Shiv Sena", the party has thanked Islamabad for calling it a terror organisation and said it will never compromise on issues concerning the neighbouring country.An editorial in Shiv Sena's mouthpiece - Saamna - stated, "If Pakistan considers us as its enemy, it is a matter of pride. It is like getting Mahavir Chakra."

పాకిస్థాన్ కు ధన్యవాదాలు అంటున్న శివసేన

Posted: 11/02/2015 03:21 PM IST
Thank you pakistan for calling us a terror organisation

భారత దాయాది దేశం పాకిస్థాన్ మీద, పాకిస్థాన్ కు చెందిన వారి మీద శివసేన ఎప్పుడూ కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది. అయితే తాజాగా పాకిస్థాన్ కు ధన్యవాదాలు తెలుపుతూ.. శివసేన తన పత్రిక సామ్నాలో ఓ ఆర్టికల్ ప్రచురించింది. అందులో పాకిస్థాన్ కు ధన్యవాదాలు అంటూ రాసింది. ఇంతకీ ఎందుకు అలా అంటే. దేశంలోని అతి ప్రమాదకర సంస్థల్లో శివసేన ఒకటి అంటూ పాకిస్థాన్ ప్రకటించింది. అయితే దీని మీదే శివసేన ఇలా స్పందించింది. గతంలో బాల్ ధాక్రే కూడా పాకిస్థాన్ టెర్రరిస్టుల జాబితాలో తన పేరు ఉండటాన్ని గర్వంగా చెప్పుకున్నారని.. అలాంటిది తమను పాకిస్థాన్ ప్రభుత్వం ప్రమాదకరమైన సంస్థగా గుర్తించడం తమకు గర్వకారణమే అంటోంది శివసేన. తమకు మహావీర చక్ర వచ్చినంత సంతోషంగా ఉందని కూడా శివసేన తన పత్రిక సామ్నాలో వెల్లడించింది.

శివసేన గత కొంత కాలంగా పాకిస్థాన్ ను టార్గెట్ గా చేస్తూ వ్యాఖ్యలు చేస్తోంది. పాకిస్థాన్ గాయకుడు ముంబైలో కచేరీ పెట్టడాన్ని కూడా శివసేన వ్యతిరేకించింది. చివరకు ఆ కచేరి నిర్వహించనే లేదు. అలాగే పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి రాసిన బుక్ ను ముంబైలో ఆవిష్కరణ చేద్దామనుకుంటే.. దాన్ని వ్యతిరేకించింది. నిర్వాహకుల మీద ఇంకు దాడి చేసి సంచలనం రేపింది. డిసెంబర్ లో జరగాల్సిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ మీద కూడా హెచ్చిరికలు జారీ చేసింది. దాంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తమ భారత్ టూర్ ను రద్దు చేసుకుంది. మొత్తానికి శివసేన పాకిస్థాన్ ను, పాకిస్థాన్ తో సంబందం ఉన్న అన్ని అంశాలను వ్యతిరేకించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  India  Shivasena  uddhav thackeray  Mumbai  Pakistan govt  shivasena in Mumbai  

Other Articles