union government | caps | prices of new drugs | treatment | diabetes | hypertension | pneumonia

Govt caps prices of new drugs to treat diabetes hypertension

diabetes, hypertension, pneumonia, Drug price regulator National Pharmaceutical Pricing Authority, capped prices of medicines, Unichem, Merck, Franco Indian, Cipla, cheaper medicines, Alembic Pharma, Cheaper Medicines, NPPA, diabetes

medicines for treatment of diabetes, hypertension and pneumonia are set to be cheaper from Diwali. Drug price regulator National Pharmaceutical Pricing Authority has capped prices of as many as 18 new brands of essential medicines

గుడ్ న్యూస్.. ఆ వ్యాధిగ్రస్తులకు దీపావళి నుంచి పండగే..!

Posted: 11/02/2015 03:09 PM IST
Govt caps prices of new drugs to treat diabetes hypertension

గుడ్ న్యూస్.. అయితే ఇది అందరికీ కాదండోయ్. మధుమేహం, హైపర్ టెన్షన్, న్యూమోనియా వ్యాధి గ్రస్తులకు మరో విధంగా వారి కుటుంబసభ్యలకు కూడా. అదెలా అంటారా..? దీపావళి పండుగ నుంచి మధుమేహం, హైపర్ టెన్షన్, న్యూమోనియా వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఈమేరకు 18 నూతన బ్రాండ్లకు చెందిన నిత్యావసర ఔషధాల ధరలపై జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) నియంత్రణ విధించింది. ఈ ఔషధాలు మరో పక్షం రోజుల్లో మార్కెట్‌లో విడుదలకానున్నాయి.  ఔషధ ధరల నియంత్రణ ఆర్డర్ (డీపీసీవో)-2013లోని పారాగ్రాఫ్ 5 పరిధిలోకి ఈ నూతన ఔషధాలను తీసుకొస్తూ.. వాటి ధరలు ఇష్టానుసారం పెంచకుండా పరిమితులు విధించింది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఔషధాల ఎమ్మార్పీ ధరల ఆధారంగా వాటి గరిష్ఠ రిటైల్ ధరను ఎన్పీపీ నిర్ణయించింది. ప్రముఖ ఫార్మాసుటికల్ కంపెనీలు సిప్లా, మెర్క్, ఫ్రాంకో ఇండియన్, అలెబిక్ ఫార్మా, యూనిచెమ్ మొదలైన వాటి నుంచి ఈ ఔషధాలు మార్కెట్‌లోకి రానున్నాయి. ఎన్పీపీ నిర్దేశించిన ప్రకారం ఆయా సంస్థలు ధరలు నిర్ణయించకపోతే.. చట్టపరంగా తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అంతేకాకుండా అధికంగా వసూలుచేసిన మొత్తానికి డిపాజిట్‌ను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని ఔషధ నియంత్రణ సంస్థ తన తాజా ఆదేశంలో పేర్కొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cipla  Cheaper Medicines  NPPA  diabetes  

Other Articles