Chhota Rajan may be brought back today

Chhota rajan may be brought back today

chhota Rajan, India, Bali, Mafia Don, Mumbai, Dawood, Indonesia, Rajan, Chhota Rajan to India

Chhota Rajan, who was arrested in Bali on 25 October, will most likely arrive in India . The deportation process has already begun and the 55-year-old gangster will be taken to Delhi first.The Indian Express reports that the First Secretary (Consular) Sanjeev Kumar Agrawal from the Indian embassy in Indonesia met Rajan early on Monday. A team of officers from CBI, Delhi police and Mumbai police arrived in Bali on Monday to meet Rajan and continue the deportation process.

ఛోటా రాజన్ నేడు భారత్ కు వచ్చే అవకాశం

Posted: 11/03/2015 08:15 AM IST
Chhota rajan may be brought back today

భారత ప్రభుత్వం కళ్లు కప్పి.. తప్పించుకు తిరిగిన మాఫియా డాన్ ఛోటా రాజన్ ను ఈ రోజు భారత్ కు తిరిగి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బాలి చేరుకున్న భారత సీబీఐ, పోలీసుల బృందం మొదటిసారి చోటారాజన్‌ను ప్రశ్నించింది. అతన్ని భారత్ తరలించేందుకు ఇండొనేషియా పోలీసులతో భారత బృందం చర్చలు జరుపుతోంది. రాజన్ తరపు న్యాయవాది భారత్ తరలించేందుకు అభ్యంతరం తెలపకపోతే, భారత బృందానికి రాజన్‌ను అప్పస్తామని, అందుకోసం కాస్త సమయం పట్టే అవకాశముందని ఇండొనేషియా పోలీసులు స్పష్టం చేశారు. ముంబైలో రాజన్‌పై మత్తుమందుల సరఫరా, బలవంతపు వసూళ్లు, హత్య తదితర 70కిపైగా కేసులున్నాయి. ఇప్పటికే చోటారాజన్‌ను ఇండొనేషియాలోని భారత రాయబారి సంజీవ్‌అగర్వాల్ బాలిలో కలిశారు. దావుద్ ఇబ్రహీం నుంచి చోటారాజన్‌కు ప్రమాదం పొంచి ఉందని భారత భద్రతాధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అతనికి భద్రతను కట్టుదిట్టం చేశారు.

చోటారాజన్‌ను భారత్ తీసుకువచ్చాక ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచనున్నట్టు సమాచారం. అందుకోసం జైలు పరిసరాల్లో జైళ్లశాఖ అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ముంబైలో 1993లో జరిగిన వరుస బాంబుపేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం అనుచరులు ఇదే జైలులో ఖైదీలుగా ఉన్నారు. వారినుంచి చోటారాజన్‌కు ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాలను జైలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. తీవ్రవాది కసబ్ భద్రతను చూసిన ఇండొ-టిబెటన్ సరిహద్దు పోలీసుల తరహాలో చోటారాజన్‌కు పారామిలిటరీ బలగాలతో భద్రతను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు కసబ్‌ను ఉంచిన అత్యంత భద్రతావలయంగల గదిలోనే చోటారాజన్‌ను కూడా ఉంచే అవకాశాలున్నట్టు ఓ అధికారి తెలిపారు. అలాగే భద్రతాకారణాల రీత్యా చోటారాజన్‌ను జైలు ఆవరణలోని ప్రత్యేక కోర్టులోనే విచారించాలని పోలీసులు కోరే అవకాశమున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chhota Rajan  India  Bali  Mafia Don  Mumbai  Dawood  Indonesia  Rajan  Chhota Rajan to India  

Other Articles