కోరిక... బంధాల్ని మరిపించేస్తోంది. కామం.. కోరికల్ని అదుపులో పెట్టుకోనివ్వకుండా చేస్తోంది. ఈ రెండు జతై మనిషిని ఆవేశానికి గురి చేస్తున్నాయి. ఆ ఆవేశంతో వారివరసలను ఏమాత్రం చూడకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అది తప్పని తెలిసినప్పటికీ వెనక్కు తగ్గడం లేదు. అందుకే.. నేటి ఆధునిక యుగంలో అక్రమ సంబంధాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఇప్పటికే ఎన్నో ఘటనలు జరగగా.. తాజాగా సభ్యసమాజం తలదించుకునేవిధంగా మరో దారుణం వెలుగు చూసింది. కూతురితో సమానమైన కోడలితో మామ అక్రమసంబంధం కొనసాగిస్తుండగా.. అది చూసి తట్టుకోలేకపోయిన కొడుకు తన తండ్రిని చంపేశాడు. అలాగే.. తన భార్యను చిదకబాదేశాడు. ఈ ఘటన నామక్కల్ జిల్లా మోగినికాడు పుదువలవు ప్రాంతంలో చోటు చేసుకుంది.
పుదువలస ప్రాంతంలో అశోకన్ (32), రేవతి (24) అనే దంపతులు నివశిస్తున్నారు. వీరికి వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరితోపాటు అశోకన్ తండ్రి తంగరాజు (52) కూడా నివశిస్తున్నాడు. అయితే, అశోకన్ లారీ డ్రైవర్ కావడంతో విధులకు వెళ్లి రెండు మూడు రోజులకుగాని ఇంటికి తిరిగి వచ్చేవాడు కాదు. ఈ నేపథ్యంలో కోడలితో తంగరాజుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లు తమ బంధాన్ని అశోకన్ కు తెలియకుండా గుట్టుగానే సాగించారు. కానీ.. ఆ తర్వాత ఈ విషయం అశోకన్ కి తెలిసిపోయింది. తొలుత కోపంతో రగిలిపోయిన అశోకన్.. అనంతరం శాంతించి ఇద్దరిని మందలించాడు. అలా చేయడం తప్పని ఓసారి క్లాస్ పీకి వదిలేశాడు. ఆ విధంగా అశోకన్ ఇద్దరినీ తీవ్రంగా మందలించినా ఫలితం లేకపోయింది. మామకోడళ్లు తిరిగి తమ బంధాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే... శుక్రవారం అర్థర్రాతి విధుల నుంచి ఇంటికొచ్చిన అశోకన్‌కు తన గదిలో తండ్రి, భార్య కనిపించడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో వంట గదిలో ఉన్న సౌక కట్టెతో ఇద్దరిపై దాడి చేశాడు.
ఈ దాడిలో తంగరాజు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోగా, భార్య రేవతి తీవ్రంగా గాయపడి ప్రాణభయంతో పరుగులు పెట్టింది. తండ్రి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న అశోకన్ అక్కడ నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వాళవందినాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని అటవీ ప్రాంతంలో దాగిన అశోకన్‌ను అరెస్టు చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more