JDU released a video which shows Modi with a rapist

Jdu released a video which shows modi with a rapist

Modi, Nitesh Kumar, Bihar, Modi with Asaram, Modi in Bihar, Bihar elections, Modi with asaram video

Bihar's ruling JD-U on Monday released an old video of Prime Minister Narendra Modi sharing the stage with controversial self-styled godman Asaram Bapu, who is currently in jail in a rape case. Janata Dal-United spokesperson Sanjay Singh said the video and pictures of Modi with yoga guru Ramdev, Shankaracharya, Sathya Sai Baba, Sri Sri Ravi Shankar, Asaram Bapu and Jain seers exposed his claim that he never visited such men.

ITEMVIDEOS: రేపిస్ట్ తో మోదీ.. వీడియో విడుదల

Posted: 11/03/2015 03:17 PM IST
Jdu released a video which shows modi with a rapist

బీహార్ ఎన్నికల బరిలో కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. బీహార్ సిఎం నితీష్ కుమార్ ఓ మాంత్రికుడితో మాట్లాడుతున్న వీడియోను విడుదల చేసిన బిజెపి... దాని మీద తీవ్రంగా విమర్శలు గుప్పించింది. బీహార్ కు ఇలా మాంత్రికులను నమ్మే వారు కావాలా.? అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. అయితే దాని మీద నితీష్ కుమార్ వివరణ ఇచ్చుకున్నారు. తాను రెండు సంవత్సరాల క్రితం అతడిని కలిశానని.. అలాగే రాజకీయాల గురించి తాను ఏం మాట్లాడలేదని.. ఆ మాంత్రికుడే తనతో మాట్లాడాడని నితీష్ కుమార్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా జెడియు నాయకులు మోదీ వీడియోను విడుదల చేశారు. అందులో మోదీతో పాటు ఓ రేపిస్ట్ కూడా ఉండటం విశేషం.

బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నితీష్ కుమార్ మీద చేసిన వీడియోలకు కౌంటర్ గా మోదీ వీడియోను విడుదల చేశారు జెడియు నాయకులు. అందులో మోదీతో పాటుగా ఓ సాధువు అది కూడా రేప్ చేసిన కేసులో ప్రస్తుతం కటకటాలపాలైన ఆసారాం బాపూ ఉన్నారు. దీన్ని విడుదల చేసిన జెడియు నాయకులు మోదీ మీద తీవ్రంగా విమర్శించారు. మోదీ ఇలా ఏకంగా క్రిమినల్స్ తో పాటు.. వేదికను పంచుకోవడం మీద ఎలా స్పందిస్తారో.. అని ప్రశ్నించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా దీనిపై స్పందించారు. ఆసారాం బాపూ, మోదీ ఒకే పార్టీకి చెందిన వారు అని ఎద్దేవా చేశారు. 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Nitesh Kumar  Bihar  Modi with Asaram  Modi in Bihar  Bihar elections  Modi with asaram video  

Other Articles