kidney transplant is the main reason behind chota raja surrender in bali | chota rajan kidney transplant

Kidney transplant is the main reason for chota rajan surrender in bali

chota rajan arrest, chhota rajan kidney transplant, chota rajan in bali jail, indonesia bali jail, mumbai crime branch, chhota rajan kidney problem

kidney transplant is the main reason for chota rajan surrender in bali : Mafia don Rajendra Sadashiv Nikhalje alias Chhota Rajan is believed to have planned his arrest as suffers from kidney trouble and needs an urgent kidney transplant.

ఛోటారాజన్ అందుకే దొరికిపోయాడట!

Posted: 11/04/2015 04:41 PM IST
Kidney transplant is the main reason for chota rajan surrender in bali

దాదాపు 20 ఏళ్లకుపైగా ఎవ్వరికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అండర్ వరల్డ్ డాన్ ఛోటారాజన్.. వున్నట్లుండి పోలీసులకు దొరికిపోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను కావాలనే పోలీసులకు దొరికిపోయాడని, అందుకు ఓ బలమైన కారణం కూడా వుందనే భావనలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. లేకపోతే.. అన్నాళ్లూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఈ డాన్.. ఇంత సులువుగా దొరికిపోవమేంటి? అనే ప్రశ్నని లేవనెత్తుతోంది.

నిన్నటిదాకా ఎవరికంటా పడకుండా విలాసవంతమైన జీవితాన్ని గడిపిన 55 ఏళ్ల ఛోటా రాజన్.. కొన్నాళ్ల క్రితం తీవ్ర అనారోగ్య సమస్య బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలోనే రహస్యంగా చికిత్స జరిపించుకున్న రాజన్ కు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో.. అతగాడు గత ఏడాదికాలం నుంచి భారత్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాడట. భారత్ లో అతనికి కిడ్నీ దానం ఇవ్వడానికి కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారట. ఈ మేరకు ముంబై క్రైమ్‌ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. 'ఛోటారాజన్ రెండు మూత్రపిండాలూ చెడిపోయాయి. దీంతో ఆయన ప్రస్తుతం డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆయన బతకాలంటే ఒక కొత్త కిడ్నీ అవసరముంది. పరారీ ఖైదీగా ఉన్న రాజన్ విదేశాల్లో ఈ శస్త్రచికిత్స చేయించుకోవడం వీలుపడదు. అందుకే... భారత్ కు తిరిగివస్తే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అధికారులు అనుమతించే అవకాశముందని రాజన్ భావిస్తున్నాడ’ని క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు తెలిపారు.

గత రెండు దశాబ్దాలుగా పరారీలో అజ్ఞాత జీవితం గడుపుతున్న ఛోటా రాజన్ కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. గత ఏడాదే తన ఆరోగ్య పరిస్థితి గురించి భారత్‌లోని తన కుటుంబసభ్యులకు రాజన్ వివరించగా.. అతని మేనల్లుడు కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. రాజన్ తన వైద్య పరీక్షల వివరాలు కుటుంబసభ్యులకు మెయిల్ ద్వారా పంపించగా.. వాటిని దక్షణ ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోని నెఫ్రాలజిస్టుకు చూపించారు. దీంతో ఇద్దరి కిడ్నీలు మ్యాచ్ అవుతాయని, రాజన్‌కు ఆయన మేనల్లుడు కిడ్నీ ఇవ్వవచ్చునని వైద్యుడు సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మలేషియాలోని బాలిలో ఛోటారాజన్ అరెస్టయ్యాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chhota rajan kidney transplant  mumbai crime branch  

Other Articles