బీహార్ ఎన్నికలలో ఎన్డీయే హెటెక్ ప్రచారంతో మళ్లీ లాలూ ప్రసాద్ యాదవ్ కు పరాభవం తప్పదా..? అన్న అంచానాలు తారుమారయ్యాయి. లాలూ.. నితీష్ కుమార్ విడిపోయిన తరువాత ఒకరినోకరు విమర్శించుకున్న ప్రసంగాలను ప్రచారం చేసినా లాభం లేకపోయింది. నితీష్ కుమార్ నీతివంతుడైనా.. అవినీతిపరుడు లాలూ ప్రసాద్ తో ఎలా జతకడతాడని.. ఆయన అవినీతిపై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుతో ఎన్నికలలో తాను స్వయంగా పోటీ చేసే అవకాశాన్ని కూడా పోగొట్టకున్నాడని ఎన్డీఎ ప్రచారం చేసింది.
ఈ అంశాన్ని 15 మంది కేంద్రమంత్రలు బీహార్ లో తిష్టవేసి ప్రచారం చేశారు. అంతేకాదు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సహా ప్రముఖ నేతలందరూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. బీహర్ గత అసెంబ్లీ ఎన్నికలలో తామకు వచ్చిన స్థానాలను మరింత మెరుగుపర్చుకోవాలని భావించారు. గత సార్వత్రిక ఎన్నికలలో తమకు లభించిన సీట్లను తాజా ఎన్నికలలో ఓట్లుగా మలుచుకోవాలని అశించి.. శక్తికి మించి కృషి చేశారు. అయినా బీహార్ ఓటర్లు మాత్రం లాలూ వైపు అధికంగా మొగ్గు చూపారు. లాలూ అర్జీడీ పార్టీని అత్యధికంగా సీట్లను కట్టబెట్టి రాజకీయ విశ్లేషకులు అంచానాలను, తారుమారు చేశారు.
తనతో సమఉజ్జీ అయిన నితీష్ కుమార్ గుజరాత్ అభివృధ్ది కన్నా అధికంగా బీహార్ ను అభివృద్ది చేశాడన్నది ఓటర్లు విశ్వసించారు. సంపన్నరాష్ట్రమైన గుజరాత్ ను అభివృద్ది చేయడం పెద్ద విషయం కాదని భావించిన ఓటరు.. అభివృద్ది అమడదూరంలో వున్న భీహార్ను అభివృద్దిలో పయనింపజేయడం నితీష్ వల్లే సాధ్యమైందని భావించారు. అందుకనే నితీష్ లాలూలతో కూడిన మహాకూటమికే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో బీజేపి అభివృద్ది మంత్రి కేవలం బడాబాబుల చుట్టూనే తిరుగుతుందని కూడా ఓటరు గ్రహించారన్నది ఈ ఎన్నికల ఫలితాలతో సుస్పష్టం అయ్యింది.
సరిగ్గా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విడిపోయిన సమఉజ్జీలు.. ఆ తరువాత పరిస్థితుల ప్రభావంతో దాయాధులుగా మారారు. ఎంతలా అంటే.. రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడనంతగా, ఈ తరుణంలో వచ్చిన ఎన్నికలకు బీజేపి బీహార్ ప్రజలపై వరాల జల్లును కురుపించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిహార్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న బీజేపి.. ఎన్నికల నేపథ్యంలో లక్షా 60 వేల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. పదో తరగతి, ఇంటర్ విద్యార్థినులకు స్కూటీలు.. రెండేళ్ల వరకు ఉచిత పెట్రోల్.. ఇలా అనేక వరాలు కురిపించింది అయినా ఓటరు మాత్రం మహాకూటమి పక్షాణ నిలిచాడు. మూడింట రెండోంతుల స్పష్టమైన మెజారిటీని మహాకూటమికి అందించాడు. మరీ ముఖ్యంగా లాలూ పార్టీని అధ్యధిక సీట్లతో మెజారిటీ సాధించిన పార్టీగా నిలిపాడు
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more