Chinese man dying of cancer who wants to wed marries a SEX DOLL | chinese romantic dolls | chinese culture

Chinese man married with sex doll after knows he is going to die soon

chinese man married with sex doll, chinese boy married with doll, man married with doll, chinese doll, chinese married doll, china boy marriage ceremony

chinese man married with sex doll after knows he is going to die soon : A Chinese man with terminal cancer has married a sex doll because he didn’t want to leave behind a bereaved widow.

సెక్స్‌డాల్‌తో పెళ్లి చేసుకున్న నవయువకుడు

Posted: 11/09/2015 03:49 PM IST
Chinese man married with sex doll after knows he is going to die soon

అదేంటి.. ఎంతోమంది అమ్మాయిలు వుండగా సెక్స్ డాల్ తో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అనే సందేహాలు ఈ టైటిల్ చూడగానే ప్రతిఒక్కరికి రాక తప్పదు. నిజానికి ఆ అబ్బాయి కూడా ఓ అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుని సుఖంగా జీవితం కొనసాగించాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ.. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది. తనకు ప్రాణాంతక వ్యాధి వున్నట్లు తెలిసింది. ఎంతోకాలం బతకడని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. దాంతో పెళ్ళి చేసుకున్నాకే తనువు చాలించాలని భావించిన ఆ యువకుడు.. సెక్స్ డాల్ తో వివాహం చేసుకున్నాడు.

చైనాకు చెందిన 28 ఏళ్ల అందమైన యువకుడు చూడానికి ఎంతో హ్యాండ్ సమ్ గా వుంటాడు. అతని వెంటపడే అమ్మాయిల జాబితా కూడా చాలా ఎక్కువే. తానూ అందరిలాగే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవన విధానాన్ని కొనసాగిద్దామని అనుకున్నాడు. కానీ.. ఇంతలోనే అతనికి టెర్మినల్ క్యాన్సర్ (ప్రాణాంతక క్యాన్సర్) ఉన్నట్టు బయటపడింది. ఎక్కువకాలం బతకలేడని డాక్టర్లు కూడా తేల్చి చెప్పేశారు. దాంతో పెళ్లి చేసుకున్నాకే తనువు చాలించాలనుకున్నాడు ఆ యువకుడు. తనని పెళ్లి చేసుకోవడానికి దయతలచి మానవత్వంతో ఎవరు ముందుకొచ్చినా.. వారి జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుందని ఆ చైనా యువకుడు భావించాడు. చివరకు సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకోవాలని తీర్మానించాడు. బంధు, మిత్రుల సహకారంతో ముహూర్తం పెట్టుకున్నాడు. ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న బొమ్మను పెళ్లి కూతురును చేశారు.

బంధు, మిత్రులు మేకప్ ఆర్టిస్ట్‌ను, ముత్తయిదువులను పిలిపించి పెళ్లి కూతురును ముస్తాబు చేశారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి ఘనంగా జరిపించారు. అనంతరం పెళ్లి కూతురుతో పెళ్లి కొడుకు ఫొటోలను ప్రత్యేకంగా తీశారు. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న సెక్స్ డాల్ ముందు మొకాళ్లపై వంగి సున్నితమైన ఆమె మునివేళ్లను చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా పెళ్లి కొడుకు ముద్దాడుతున్న దృశ్యాలను కెమెరాలతో చిత్రీకరించారు. అనంతరం వారిని ఏకాంతంగా వదిలేసి బంధు, మిత్రులు వెళ్లి పోయారు. ఇప్పుడు ఈ పెళ్లి ఫొటోలు చైనా సోషల్ వెబ్‌సైట్‌లో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ముందుగా ఈ ఫొటోలను ప్రచురించిన చైనా వెబ్‌సైట్ పెళ్లి కొడుకు వివరాలను మాత్రం వెల్లడించలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chinese man married with doll  chinese marriage cultures  

Other Articles