దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కాంగ్రెస్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ కేసులో కీలక పురోగతి సాధించింది. ఢిల్లీ పోలీసులు ఎదురు చూస్తున్న ఎఫ్-బీఐ ఫోరెన్సిక్ రిపోర్టు ఎట్టకేలకు వారి చేతికి అందింది. అయితే ఢిల్లీ పోలీసులు భావించినట్లు సునంద మరణానికి రేడియో ధార్మిక పదార్థం కారణం కాదని ఎఫ్.బీ.ఐ రిపోర్టు స్పష్టం చేసింది. సునంద పుష్కర్ మృతికి కారణాలు తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల సాయం కోరిన సంగతి తెలిసిందే. తొమ్మిది నెలల తర్వాత ఫోరెన్సిక్ రిపోర్టు వివరాలు ఎఫ్-బీఐ సీల్డ్ కవర్ లో ఢిల్లీ పోలీసులకు అందింది.
సునంద పుష్కర్ ను చంపడానికి నిందితులు ఉపయోగించిన విషపదార్థం పేరు 'పొలోనియం' అని ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు. ఇదే విషయం ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో కూడా ఉంది. అయితే సునంద మృతికి పొలోనియం కారణం కాదని ఎఫ్-బీఐ రిపోర్టు స్పష్టంచేసింది. సునంద మరణానికి కారమైన విషపదార్థం పేరును రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ రిపోర్టుపై ఢిల్లీ పోలీసులు నోరు మెదపడం లేదు. ఎఫ్-బీఐ రిపోర్టు గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బాసీ ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ ‘త్వరలోనే కేసుకు సంబంధించిన కొన్ని నిజాలు తెలుస్తాయి' అని తెలిపారు. ఈ రిపోర్టుతో కేసుకు సంబంధించిన అనేక చిక్కుముడులు వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
సునంద మృతి కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ ఆరుగురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. సునంద భర్త, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్-తో సహా ఆరుగురు నిందితులకు పాలిగ్రాఫీ పరీక్షలు సైతం నిర్వహించారు. గత ఏడాది జనవరి 17న ఢిల్లీలోని లీలా హోటల్-లో సునంద పుష్కర్ అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్-తో ట్విట్టర్-లో తీవ్ర మాటల యుద్ధం జరిగిన ఒక్క రోజు లోపే సునంద మృతి చెందడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఎఫ్-బీఐ తాజా రిపోర్టుతో కేసు విచారణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more