వర్ణ వివక్ష అంతరించి పోయిందని గొప్పలు చెప్పుకునే పాశ్చాత్య దేశాల్లో నేటికీ అ జాడ్యం ఇంకా ప్రభలుతూనే వుందని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో గల యాపిల్ స్టోర్లో జరిగిన ఘటన ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ఈ కంపెనీ ఆఫీసుకు ఆరుగురు నల్ల జాతీయులు వచ్చారు. వారందరూ టీనేజర్లు కావడంతో వారిని స్టోర్ నుంచి వెళ్లిపోవాలని సెక్యూరిటీగార్డు సూచించాడు. ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నిస్తే.. 15 నుంచి 16 సంవత్సరాల నల్ల జాతీయులు ఏదైనా దొంగిలిస్తారేమోనన్న అనుమానంతో రానివ్వమని సెక్యూరిటీ తెలిపాడు.
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన నల్లజాతి యువకులు ఘటననంతా వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 'సింపుల్ రేసిజం' అనే టైటిల్ తో ఫేస్ బుక్ లో పెట్టగా దానిని ఇప్పటికే 60,000మందికి పైగా చూశారు. దీంతో ఎట్టకేలకు ఈ ఘటనపై యాపిల్ కంపెనీ యాజమాన్యం స్పందించింది. తమ స్టోర్లోకి వచ్చిన ఆరుగురు ఆఫ్రికా విద్యార్థులను బయటకు గెంటేసిన ఘటనపై ఆపిల్ సంస్థ క్షమాపణలు చెప్పింది.
తమ సిబ్బంది చేసిన పొరపాటుకు చింతిస్తున్నామని, ఈ విషయంలో క్షమించాలని కోరింది. ప్రతి వినియోగదారుడు తమకు సమానమేనని పేర్కోంది. అయితే, స్టోర్ యాజమాన్యం క్షమాపణలు చెప్పిన తర్వాత తిరిగి ఆ విద్యార్థులు బుధవారం షాపింగ్ కు వెళ్లారు. ఇలా ఒక్క ఐ ఫోన్ స్టోర్లే కాదు.. వారు ఎక్కడికి వెళ్లినా దాదాపుగా తమ ఆఫ్రికన్లపట్ల జాతివివక్ష చూపిస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more