Doctor betrays lover, threatens to defame her as prostitute

Hyderabad doctor decives lover threatens her to defame her

Dr. Randhir, doctor betrays lover, decieves lover, prostitute, cheating case, Jubilee Hills, love, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

A young woman from Yusufguda who was pursued online through ‘we chat’ by a medical doctor and seduced with promises of marriage,

పెళ్లి కావాలంటే.. రూ. 8 కోట్లు.. లేదంటే బ్రోతల్ కేసు.. జాగ్రత్తా..!

Posted: 11/12/2015 09:25 PM IST
Hyderabad doctor decives lover threatens her to defame her

ప్రేమించానన్నాడు... పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. శారీరక అవసరాలను తీర్చుకున్నాడు. గర్భం దాల్చితే ప్రియురాలికి వైద్యుదైన ప్రియుడు ట్యాబ్లెట్‌లు ఇచ్చి అబార్షన్ చేయించాడు.. జర్మనీలో పీజీ చేసి వచ్చాక పెళ్లి చేసుకుంటానఃన్న ప్రియుడు.. 8 కోట్లు రూపాయల కట్నం ఇస్తేనే తాళి కడతానంటూ షరతు పెట్టాడు. అంతటితో ఆగలేదు... పెళ్లీ గిళ్లీ అంటూ వెంటపడ్డావంటే బ్రోతల్ కేసులో ఇరికిస్తా.. అంటూ బెదిరించాడు.. ఇదీ ప్రేమించిన అమ్మాయికి ఓ యువవైద్యుడి నుంచి ఎదురైన 'ట్రీట్‌మెంట్'..  

వివరాల్లోకి వెళితే.. దిల్‌సుక్‌నగర్‌లో నివాసం ఉండే ఎన్.రణధీర్‌రెడ్డి(27) ఎంబీబీఎస్ పూర్తిచేసి నగరంలోని ఆక్సిజన్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. తొమ్మిది నెలల క్రితం యూసుఫ్‌గూడ జవహర్ నగర్‌కు చెందిన యువతి(25)తో 'వీ-చాట్' లో పరిచయం పెంచుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత నేరుగా యువతి ఇంటికి వచ్చి ప్రేమిస్తున్నానని, ఒకే కులం కావడంతో పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మించాడు. దాంతో శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో యువతి గర్భం దాల్చగా పీజీ చేసేందుకు జర్మనీ వెళ్లివచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అంటూ అబార్షన్ చేయించాడు.

 కాగా పెళ్లి గురించి మాట్లాడేందుకు ఈ నెల 1న దేవర కొండ తీసుకెళ్లిన రణథీర్.. పెళ్లి కావాలంటే రూ.8 కోట్లు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రణథీర్ తల్లి రత్నమ్మ, సోదరుడు సుధీర్ రెడ్డి పెళ్లికి ఒప్పుకోలేదటూ.. యువతిని యూసఫ్ గూడలో వదిలేసి వెళ్లాడు. తర్వాత పెళ్లి మాటెత్తితే కుటుంబాన్ని అంతం చేస్తాం.. బ్రోతల్ కేసులో ఇరికిస్తా అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో యువతి జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 417, 420, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసి డా.రణధీర్‌ను రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dr. Randhir  Hyderabad  decieves lover  prostitute  cheating case  Jubilee Hills  love  

Other Articles