Shootings and explosions in Paris

Shootings and explosions in paris

paris, France, Terror, Attack, paris Attack, explosions in paris, shootings in Paris

Explosions hit a bar near the Stade de France stadium during a soccer match, even as a hostage crisis, which has now concluded, unfolded at a concert hall. There were also shootings near restaurants and bars in the city’s 10th and 11th Arrondissements, districts near the center of the city. An eyewitness told Al Jazeera that several men entered the concert hall and started firing into the air. An American band called Eagles of Death Metal was playing to a packed crowd of close to a thousand.

ప్యారిస్ లో ఉగ్రపంజా.. 140 మంది మృతి

Posted: 11/14/2015 07:48 AM IST
Shootings and explosions in paris

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాంబుదాడులు, కాల్పులతో బీభత్సం సృష్టించారు. నెత్తుటి ఏరులు పారించారు. జాతీయ స్టేడియం, పలు రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లలో బాంబులతో దాడులు చేశారు. ప్రజలపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్యారిస్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనల్లో ఇప్పటివరకు దాదాపు 140 మంది చనిపోయినట్లు సమాచారం. ఒక్క బటాక్లాన్ థియేటర్ దగ్గరే 100 మందిని కిరాతకంగా మట్టుబెట్టారు ముష్కరులు. ప్యారిస్ లోని ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 40 మంది చనిపోయారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్యారిస్ లోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ దుండగుడు అక్కడున్నవారిపై కాల్పులు జరిపినట్లు మొదట పోలీసులకు సమాచారం అందింది.

బటాక్లాన్ ఆర్ట్ సెంటర్ ప్రాంతంలోనూ కాల్పులు జరిపి, కొందరిని బందీలుగా పట్టుకున్నట్లు మరికాసేపటికే వార్త అందింది. బాటాక్లాన్ ధియేటర్ సమీప ప్రాంతం.. ఐదు పేలుళ్లు హోరెత్తిపోయింది. అక్కడే ఉగ్రవాదులు ప్రజలను బందీలుగా పట్టుకున్నారు. జాతీయ స్టేడియానికి సమీపంలోని ఓ బార్ లోనూ వరుసగా రెండు పేలుళ్లు జరిగాయి. ఇవి రెండూ ఆత్మాహుతి దాడులే. అక్కడే కొద్దిసేపు కాల్పులు కూడా జరిగాయి. ఆ స్టేడియంలో జర్మనీ, ఫ్రాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. జర్మన్లు అధిక సంఖ్యలో వచ్చే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డట్లు తెలుస్తోంది.

ఉగ్రవాదుల దాడి ఘటనతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్టేడియానికి వచ్చి మ్యాచ్ ను వీక్షిస్తున్న దేశాధ్యక్షుడు కోయిస్ హోలాండేను హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొత్తం ఆరుగురు సాయుధులు నగరంలోకి చొరబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్రాన్స్ మొత్తం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులు ఇళ్లలోంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. పౌరులను బందీలుగా పట్టుకున్న బటాక్లాన్ ధియేటర్ ప్రాంతాన్ని పోలీసులు, సైనికులు చుట్టుముట్టారు. ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. ముగ్గురిని మట్టుబెట్టారు.

ఉగ్ర దాడులతో.. అధ్యక్షుడు హోలాండే అత్యవసరంగా క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సైనికులను రంగంలోకి దింపారు. దేశ సరిహద్దులను మూసేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉగ్రదాడులపై స్పందించారు. ఫ్రాన్స్ కు ఏమైనా సాయం కావాలంటే అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బందీలను వెంటనే విడిచి పెట్టాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఉగ్రవాదులను హెచ్చరించారు. ఫ్రాన్స్ కు తోడుగా ఉంటామని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రకటన విడుదల చేశారు. కొన్ని నెలల క్రితం కూడా ప్యారిస్ లోని చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ తరువాత కూడా రెండు, మూడు సార్లు కాల్పుల ఉదంతాలు జరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paris  France  Terror  Attack  paris Attack  explosions in paris  shootings in Paris  

Other Articles