దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకీ ఈ దారుణాల సంఖ్య మరింత పెరుగుతూనే వుంది. చిన్న బాలికల నుంచి ముసలివారు దాకా ఎవరు ఒంటరిగా కనిపించిన.. కామాంధులు వారిపై మృగాళ్ల విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు మరో ఘోరం వెలుగుచూసింది. ఓ బాలిక(17)పై గతకొన్నాళ్ల నుంచి కన్నేసిన ఓ దుర్మార్గుడు.. ఆమె ఇంట్లో తన సోదరులతో వున్న విషయాన్ని తెలుసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె కజిన్ ని అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం ఆ నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వాయవ్య ఢిల్లీలోని స్వరూప్‌నగర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
స్థానికంగా వున్న ఓ బాలికపై రాజు అనే ఓ కామాంధుడు గతకొన్నాళ్ల నుంచి కన్నేస్తూ వచ్చాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని చాలారకాలుగా ప్రయత్నాలు చేశాడు కానీ కుదరలేదు. అంతేకాదు.. ఆమె కుటుంబసభ్యుల గురించి విషయాలన్నీ ఆరా తీశాడు. వాళ్ళంతా ఇంట్లో ఎప్పుడుంటారు..? ఎంతమంది వుంటారు..? అనే విషయాలతోపాటు ఆ బాలిక ఏం చేస్తుంటుంది..? ఏ కాలేజీకి వెళ్తుంది..? అన్న వివరాల్ని సేకరించాడు. ఇదిలావుండగా.. బాధితురాలి కుటుంబసభ్యులు అందరూ శనివారం రాత్రి తమ బంధువుల ఇంటికి వెళ్లారు. దీంతో తాము అద్దెకు ఉంటున్న ఇంట్లో ఆ బాలిక తన ఇద్దరు మైనర్ సోదరులతో నిద్రించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ కామాంధుడు.. ఆ బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక బాధతో అరుస్తుండగా విని మేల్కొన్న ఏడేళ్ల బాలుడు కేకలు పెట్టాడు. దీంతో బాలుడ్ని బెడ్‌షీట్‌తో ఉరేసి దారుణంగా చంపేశాడు. అరుపులు విని ఉలిక్కిపడ్డ యజమాని.. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అయితే.. దుండగుడు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. బాలుడ్ని ఆసుపత్రికి తరలించినప్పటికే అప్పుడే చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. తీవ్ర రక్తస్రావమైన బాలికకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో వున్న నిందితుడు రాజు కోసం గాలిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more