అత్యవసరమైన పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని ఓ వ్యక్తి.. తన స్నేహితుడు వద్ద నుంచి రూ.30 వేలు అప్పు తీసుకున్నాడు. అందుకు బదులుగా తన భార్యను తాకట్టు పెట్టాడు. తన సమస్యలన్నీ తీర్చుకున్న అనంతరం అతనికి డబ్బులు తిరిగిచ్చేందుకు బిజీ అయిపోయాడు. అటువైపు వారిద్దరూ సహజీవనం చేస్తూ తమ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చివరికి అప్పు తీసుకున్న వ్యక్తి ఎలాగోలా తన స్నేహితుడికి తీర్చేశాడు. కానీ.. తన భార్యను వదిలిపెట్టాలంటే వడ్డీ రూపంలో మరింత సొమ్ము కావాలని స్నేహితుడు డిమాండ్ చేయడంతో అతడిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన చంఢీగడ్ లో వెలుగు చూసింది.
బీహార్లోని అరియా జిల్లాకు చెందిన మహ్మద్ గులామ్ అనే వ్యక్తి గత రెండున్నరేళ్లుగా యమునానగర్లో ఉంటున్నాడు. పత్తి ప్రాసెసింగ్ వ్యాపారం చేసే గులాంకు సబీర్ అలీ అనే స్నేహితుడు వున్నాడు. అతడు కూడా బిహార్ నుంచి వలస వచ్చినవాడే. ఓ టిఫిన్ సెంటర్ నడుపుతూ, కాంట్రాక్టర్లకు కూలీలను సరఫరా చేసే సబీర్ కు సల్మా అనే భార్య వుంది. ఓ సందర్భంలో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో సబీర్ కూరుకుపోవడంతో... జనవరిలో తన స్నేహితుడైన గులాం వద్ద నుంచి రూ. 30వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే.. ఇందుకు బదులుగా ఏదో ఒకటి తాకట్టు పెట్టాలని గులాం కండీషన్ పెట్టడంతో.. దిక్కుతోచని స్థితిలో సబీర్ తన భార్యని తాకట్టు పెట్టాడు. దాంతో గులాం ఆమెను యమునానగర్ సమీపంలోని జగధారి నగరంలో గల తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటినుంచి వారిద్దరూ సహజీవనం చేస్తూ తమ లైఫ్ ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. మార్చిలో సల్మా, గులాం ఇద్దరూ కలిసి బిహార్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు తిరిగారు.
అయితే.. సెప్టెంబర్లో మళ్లీ పత్తి సీజన్ మొదలు కావడంతో ఇద్దరూ యమునానగర్ తిరిగొచ్చారు. వాళ్లిద్దరూ అక్టోబర్ నెలాఖరు వరకు కూడా సహజీవనంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఉన్నట్టుండి గులాం దారుణ హత్యకు గురై కనిపించాడు. గులామ్ శం రెండు వారాల క్రితం పోలీసులకు దొరికింది. ఆ కేసును ఛేదించే క్రమంలో హంతకుడు అతడి స్నేహితుడు సబీర్ అని తేలింది. తాను రూ.30 వేలు చెల్లించినా, తన సల్మాను విడిచిపెట్టాలంటే మరో రూ. 20 వేలు వడ్డీగా ఇవ్వాల్సిందేనని గులాం చెప్పాడని, సరేనని ఆ మొత్తం కూడా ఇచ్చినా తన భార్యను వదల్లేదని.. దాంతో తాను, తన భార్య కలిసి గులాంను చంపేశామని సబిర్ పోలీసులకు తెలిపాడు. ఈ హత్యలో వాళ్లకు మరికొందరు స్నేహితులు కూడా సహకరించారని తెలుసుకున్న పోలీసులు.. అందరినీ అరెస్టు చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more