Maoists abduct trs leaders, demand to stop combing and fake encounters

Maoists kidnap 6 trs leaders in khammam

Maoists, jagan, kidnap, TRS leaders, Bhadrachalam, Khammam, Maoist spokesperson jagan, Bhadrachalam assembly constituency TRS leaders, TRS in-charge Mane Ramakrishna, Charla mandal leaders, Venkateswarlu, Ramakrishna, Suresh, Vajedu mandal leaders Janardhan, Satyanarayana, Punuguppa tribal region, Bhadrachalam Division, Khammam district

Maoists are said to have abducted at least six Telangana Rashtra Samiti (TRS) leaders from Punuguppa tribal region of Charla mandal under Bhadrachaam Division of Khammam district of Telangana.

కేసీఆర్ సర్కార్ కు మావోల జలక్.. నకిలీ ఎన్ కౌంటర్లు చేస్తే.. మీ నేతలే టార్గెట్..!

Posted: 11/19/2015 04:51 PM IST
Maoists kidnap 6 trs leaders in khammam

వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి మరికొద్ది సేపట్లో తెరపడనుందన్న క్రమంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు మావోయిస్టులు జలక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన నేతలను మావోలు అపహరించుకుపోయారు. ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ కు చెందిన ఆరుగురు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయకులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. విరీలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ మన్నె రామకృష్ణ తో పాటు చర్ల మండలం నేతలు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సురేష్, వాజేడు మండల నేతలు జనార్థన్, సత్యానారాయణలు వున్నారు. వీరిని చర్ల మండలం పుసుగుప్ప అటవీ ప్రాంతం నుంచి అపహరించినట్లు తెలుస్తోంది.

కాగా వీరిని అపహరించుకుపోయిన తరువాత కొద్ది సేపటికీ తెలంగాణ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. తెలంగాణలో భూటకపు ఎన్ కౌంటర్లను తక్షణం నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తామని చెప్పారు. అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న కూంబింగ్ కార్యక్రమాలను తక్షణంం నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maoists  jagan  kidnap  TRS leaders  Bhadrachalam  Khammam  

Other Articles