భారత్ లో దాడులకు పాకిస్థాన్ హస్తం ఉంటుందని.. బారత్ లో జరిగే హింసకు పాకిస్థాన్ ప్రత్యక్షంగానో లేదంటే పరోక్షంగానో సహకరిస్తుందని అందరికి తెలుసు. తాజాగా మరోసారి బారత్ లో హింసకు పాల్పడేందుకు పాకిస్థాన్ చర్యలు చేపడుతోందని తెలుస్తోంది. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణ కోసం నిధులు సమకూర్చేందుకు పాకిస్తాన్-కు చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఎత్తున విరాళాలు సేకరిస్తోంది. గడచిన ఎనిమిదేళ్లలో పాకిస్తాన్ లోని వివిధ వర్గాల నుంచి ఆ ఉగ్రవాద గ్రూపు రూ. 80 కోట్లకు పైగా విరాళాలు వసూలు చేసిందని భారత దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు హెచ్ఎం చురుగ్గా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు గత ఎనిమిదేళ్లలో ఆ సంస్థ 80 కోట్లు వసూలు చేసింది అని అధికారులు పారిస్ లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కు నివేదించారు. భారత్ కు ఈ నిధులు చేరగానే వీటిని వివిధ మార్గాల ద్వారా మళ్లించి క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదులు, మరణించిన హిబ్బుల్ ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకు అందజేస్తారు అని టాస్క్ ఫోర్స్ కు నివేదించారు. విదేశాల్లో కూడా నిధులు సేకరించి, తమ ముసుగు సంస్థలకు ఆ సొమ్మును చేరవేస్తున్నారని భారత దర్యాప్తు అధికారుల వెల్లడించారు. పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రవాదుల యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నదని, తన గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కన్నుసన్నల్లోనే ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు జరుగుతున్నాయని భారత్ ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసింది. అయినా కూడా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పాకిస్థాన్ వైఖరిలో కూడా ఎలాంటి వ్యత్యాసం కనిపించడం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more