ఆకతాయిల తాట తీసే పోలీసులే.. అకతాయి పనులకు పాల్పడితే.. ఇంకేముంది.. అది పెద్ద అంశంగా మారుతుంది. ఇది తెలిసి కూడా ఓ పోలీసు ఉన్నతాధికారి అకాతాయి కార్యానికి పాల్పడి.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అంతేకాదండోయ్ తాను చేసిన అకతాయి పనిని పలువురు మెచ్చుకోవాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఆ పని చేస్తూ.. ఫోటో దిగి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మరీ సరదా తీర్చుకున్నాడు. ఇలా సరదా పడిన ఆ పోలీసు అధికారికి ఉన్నతాధికారులు మంచి గిప్ట్ ఇచ్చారు.
అదేంటంటారా..? ఉన్న పళంగా ఉద్యోగంలోంచి సస్సెండ్ చేశారు. ఇప్పుడు తాను చేసిన పని ఎంత వెలం వెర్రిదో అర్థమయ్యాక.. ఉన్నతాధికారులు కాళ్లు, చేతులు పట్టుకుని తన సస్సెన్సన్ ఎత్తివేయాలని కోరుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఓ మహిళా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఒడిలో... హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్ కులాసాగా కూర్చున్నాడు. అలా ఎందుకు కూర్చున్నాడో తెలియదు కానీ, ఈయన గారి నిర్వాకాన్ని ఎవరో ఫోటో తీసి వాట్సాప్ లో షేర్ చేశారు.
పోలీస్స్టేషన్లో మహిళా పోలీస్ కుర్చీలో కూర్చొని ఉండగా ఆమె ఒడిలో మరో పోలీసు కూర్చొని ఉండడం ఈ ఫోటోలో స్పష్టంగా ఉంది. ఆ ఫోటో కాస్తా, ఆ ఫోనూ, ఈ ఫోనూ చేరి, చివరికి పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్ను అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే మహిళా స్పెషల్ ఆఫీసర్పై విచారణకు ఆదేశించారు. అలాగే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అసభ్యకర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.కాగా తన తప్పును మన్నించమని హెడ్ కానిస్టేబుల్ ఉన్నతాధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూ.. కాళ్లా వేళ్లా పడుతున్నాడు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడమంటే ఇది కాక మరేమిటి..
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more