CBI chargesheet claims money was the main motive behind Sheena Bora's murder case | sheena bora murder | indrani mukherjea

Sheena bora murder case money was main motive behind this case cbi chargesheet

sheena bora murder case, indrani mukherjea, peter mukherjea, sanjeev khanna, driver shyam rai, sheena bora dead body, sheena bora cbi chargesheet, cbi investigation sheena bora murder case, sheena fought with mother indrani

sheena bora murder case money was main motive behind this case cbi chargesheet : Fear of Sheena Bora inheriting the entire property of her and her husband in the event of the victim's marriage to Peter Mukerjea's son Rahul is said to be the prime motive for Indrani Mukerjea to do away with her daughter, according to the CBI chargesheet in the sensational case.

షీనాబోరా హత్యకేసులో మరో కొత్త మలుపు

Posted: 11/21/2015 12:36 PM IST
Sheena bora murder case money was main motive behind this case cbi chargesheet

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనాబోరా హత్యకేసులో మరో కొత్త మలుపు వెలుగులోకి వచ్చింది. కన్నకూతురైన షీనాని తల్లి ఇంద్రాణి ముఖర్జియా చంపడానికి గల కారణాలేంటో సీబీఐ తన విచారణలో భాగంగా తేల్చింది. ఆర్థిక కారణాలు, రాహుల్ ముఖర్జియాతో సంబంధం, ఇంద్రాణిని బ్లాక్‌మెయిల్ చేయడం లాంటివే  షీనాబోరా హత్యకు ప్రధాన కారణాలని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. ముఖ్యంగా 1300 కోట్ల రూపాయల లావాదేవీలు ఇందులో ప్రధానమని తెలిపిన సీబీఐ.. దాంతోపాటు ఇతర వ్యవహారాలపై తల్లీ కూతుళ్ల మధ్య నెలకొన్న వివాదాలే ఇంద్రాణిని తన కూతురు షీనా హత్యకు పురికొల్పాయని సీబీఐ తేల్చింది. దీంతో..  సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా తలపిస్తూ వచ్చిన ఈ హత్యకేసులో విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది.

ఇక ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణిని ప్రధాన నిందితురాలిగా పేర్కొన్న సీబీఐ...  ఇప్పటికే మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ ను అదుపులోకి తీసుకోవడంతోపాటు ప్రస్తుత ఆమె భర్త, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాను నాలుగో ముద్దాయిగా చేర్చింది. ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియా ముగ్గురూ కలిసి కేవలం ఆస్తి కోసమే షీనాను ఓ పథక ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తోంది. షీనాను అంతం చేస్తే ఆస్తి అంతా తన రెండో కూతురు నిధికే దక్కుతుందని భావించిన సంజీవ్.. ఆమెను చంపేందుకు పథకం రచించాడు. అలాగే.. రాహుల్ ముఖర్జీతో షీనా పెళ్లి జరిగితే ఆస్తి అంతా అతను ఎగరేసుకుపోతాడనే భయంతో పీటర్ ముఖర్జీయా కూడా ఈ కుట్రలో భాగం పంచుకున్నాడు. ఇక మొదటినుంచి తల్లీకూతుళ్ల మధ్య వివిధ వ్యవహారాల మధ్య తగాదాలు వున్నాయి.

ప్రధానంగా రాహుల్ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం ఇంద్రాణికి నచ్చలేదు. పైగా షీనాపై ఉన్న ఆస్తులు తిరిగి తనకు దక్కవేమోనన్న భయం ఆమెను పట్టుకుంది. ఈ నేపథ్యంలో 2004లో షీనాకు బహుమతిగా ఇచ్చిన ఏడు బెడ్‌రూంల ఫ్లాట్‌ను 2010లో ఆమెకు తెలియకుండానే ఇంద్రాణి విక్రయించింది. దీంతో తల్లికూతుళ్ళ మధ్య వివాదం మరింత రగిలింది. తామిద్దరం ప్రపంచానికి తెలిసినట్టుగా అక్కాచెల్లెళ్లం కాదు, తల్లీకూతుళ్లమనే విషయాన్ని బయటపెడతానని  షీనా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడడం ప్రారంభించింది. దీంతో కోపాద్రిక్తురాలైన ఇంద్రాణి.. ఆమెను అందమొందించాలని ఫిక్స్ అయ్యింది. ఇలా ఈ విధంగా ముగ్గురూ మూడు విధాలుగా తమ సొంత స్వలాభాల గురించి ఆలోచించి, చివరకు షీనా హత్యకు పథకం వేశారని సీబీఐ చార్జిషీటులో క్లుప్తంగా పేర్కొంది.

ఇక ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే.. 'షీనా జాగ్రత్తగా ఉండు' అంటూ ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాల  రెండవ కూతురు విధి.. సోదరి షీనాకు ఒక ఎస్సెమ్మెస్ చేసినట్టు కోర్టుకు సీబీఐ వెల్లడించింది. అంటే.. షీనాని చంపుతున్నట్లు తల్లి ఇంద్రాణి వేసిన పథకాన్ని విధి ముందుగానే పసిగట్టిందని, ఆ క్రమంలోనే ఆమె షీనాను ముందుగానే హెచ్చరించిందని సీబీఐ పేర్కొంది. ఇలావుండగా.. 2012, ఏప్రిల్ 24న ఇంద్రాణి ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ కలిసి షీనా బోరాను హత్య చేసి మారుమూల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వెలుగుచూసిన ఈ హత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ.. చివరికి ఇప్పుడున్న పరిస్థితికి చేరింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles