కాలం మారుతోంది.. గతంలో మాయ మంత్రాలకు బాగా బానిసలైన వాళ్లు ఇప్పుడు వాటిని నమ్మడం లేదు. మారుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీతో వారిలో కూడా మార్పులు వస్తున్నాయి. అయితే చాలా గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాలను వదలని చాలా మంది చాదస్తం చూపిస్తున్నారు.. మూడనమ్మకాల ముసుగులో చేస్తున్న తప్పులు వారిని పెదదారి పట్టిస్తోంది. మామూలుగా క్షుద్ర పూజలు చేసే వారు అంటేనే కాస్త. భయంకరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వారు బలి ఇవ్వాలి లేదంటే బలి తీసుకోవాలి అన్న ఆలోచనలతో ఉంటారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన అందరికి ఆశ్చర్యం.. కోపం తెప్పిస్తున్నాయి. క్షుద్ర పూజల కోసం అంటూ తమ సొంత బిడ్డను అది కూడా మూడు నెలల చిన్నారిని తమ చేతులతొ బలిచ్చిన ఘటన ఒంగోలులో చోటుచేసుకుంది.
క్షుద్ర పూజల కోసం కన్న బిడ్డను బలిచ్చిన తల్లిదండ్రులను ఎవరైనా చూశారా..? కానీ అది జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డ అన్న విషయాన్ని మరిచారు.. మాతృత్వాన్ని, మానవత్వాన్ని మరిచిన వారు బిడ్డను చంపి బలి అంటూ క్షుద్ర పూజలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మదర్‌థెరిస్సా కాలనీకి చెందిన సద్ది రాజిరెడ్డి అలియాస్ దెయ్యాల రాజిరెడ్డి జాతకాలు చెబుతుంటాడు. రాజిరెడ్డి ఓ మహిళతో కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. వారికి మూడు నెలల బాబు ఉన్నాడు. చిన్నారిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టి క్షుద్రపూజలు చేస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఈ ఉదయం పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి రాజిరెడ్డి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more