ladies fire on priest contraversial statements

Ladies fire on priest contraversial statements

Ladies, The priestm, Shabari Malai, Periods, The priest contraversial statements

Ladies very anger on Shabari Malai priest for his contraversial statements about women periods.

ఆ పూజారిపై మండిపడుతున్న మహిళాలోకం

Posted: 11/23/2015 03:53 PM IST
Ladies fire on priest contraversial statements

వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం.. తర్వాత దాని మీద దుమారం రేగడం మన దగ్గర మామూలే. అయితే తాజాగా ఓ పూజారి చేసిన వ్యాఖ్యల మీద మహిళా లోకం మండిపడుతోంది... అతడు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తు సోషల్ మీడియాలో ఓ ఉద్యామానికి తెర తీశారు మహిళా మణులు. హ్యాపీ టు బ్లీడ్ అంటూ భారత్ లో కొత్త ఉద్యమానికి కారకుడయ్యడు ఆ పూజారి. ఇంతకీ ఆ పూజారి ఏం మాట్లాడారు అనుకుంటున్నారా..? దేవుడి గుడిలోకి వచ్చే ఆడవాళ్ల బహిష్టును గుర్తించే మెషీన్లు వచ్చిన తర్వాత గుడిలోకి ఆడవాళ్లను అనుమతిస్తామని అన్నారు. దాంతో మహిళాలోకం దీనికి వ్యతిరేకంగా ఉద్యామానికి తెర తీశారు. తమ సహజసిద్ద శరీరం వల్ల వస్తున్న దాని మీద ఇలా అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం ఏంటని మండిపడుతున్నారు.

కేరళలోని ప్రఖ్యాత శబరిమల దేవస్థానంలో కొన్ని రోజులు మాత్రమే మహిళా భక్తులను గుడిలోనికి అనుమతిస్తారు.. మిగిలిన రోజులు అనుమతించరు. అయితే కొత్తగా బాధ్యతలు తీసుకున్న గుడి పూజారి దీని మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయుధాలతో వెళితే ఎలాగైతే మెషీన్లు కనిపెడుతున్నాయో అలాగే ఆడవారు బహిష్టు తో మురికిగా ఉన్నారా అని గుర్తించే మెషీన్లు వచ్చిన తర్వాత సంత్సరం మొత్తం ఆడవాళ్లకు అనుమతినిస్తామని అన్నారు. దాంతో సోషల్ మీడియాలో దీని మీద వివాదం మొదలైంది. హ్యాపీ టు బ్లీడ్ పేరుతో కొత్త ఉద్యమానికి నాంది పడింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ladies  The priestm  Shabari Malai  Periods  The priest contraversial statements  

Other Articles