Have to Remove clothes for better X ray

Have to remove clothes for better x ray

RIMS, Srikakulam, Harassment, Girl face Harassment, Harassment in RIMS, RIMS Hospital

A Employee in RIMS, Srikakulam harrase a girl. He said that have to remove clothes to get good X Ray report.

బట్టలు తీస్తే ఎక్స్ రే బాగా వస్తుందట..!

Posted: 12/01/2015 11:25 AM IST
Have to remove clothes for better x ray

అమ్మాయిలు అయితే చాలు.. ఆడతనం ఉంటే చాలు తాము మగాళ్ల అంతకన్నా కూడా మృగాళ్లం అన్నట్లు చాలా మంది ప్రవర్తిస్తుంటారు. కామంతో కళ్లు మూసుకున్న వాళ్లు ఆడవాసన తగిలితే చాలు అన్నీ మరిచిపోతుంటారు. చదువుకున్న వారు, ముసలివాళ్లు, స్కూల్ పిల్లలు ఇలా ఎవరు అన్న దాన్ని మరిచి తమ పైశాచికాన్ని చూపిస్తుంటారు. ఇక ఆస్పత్రుల్లో కూడా లైంగిక వేదింపులు తప్పడం లేదు. వైద్యో నారాయణో హరి: అన్నారు.. కానీ వైద్యానికి కూడా అమ్మాయిలను పంపించాలంటే భయపడే రోజులు దాపురించాయి.

Also Read: ఇష్టంలేనిదే రేప్ ఎలా జరిగింది..? జడ్జీ నోటిదూల.. ఉద్యోగం ఊస్ట్..!

తాజాగా శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో పరీక్షల కోసం వచ్చిన అమ్మాయికి లైంగిక వేధింపులు తప్పలేదు. ఒంట్లో బాగాలేకపోతే.. ఆస్పత్రికి వెళతే అక్కడ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఉద్యోగి. అక్కడే పనిచేస్తున్న వెంకటరమణ అనే ఉద్యోగి ఎక్స్ రే కోసమని వచ్చిన అమ్మాయిని వేధించాడు. ఎక్స్ రే బాగా రావాలంటే బట్టలు విప్పాలని అమ్మాయిని వేధించాడు. దాదాపు అర గంటపాటు అమ్మాయిని వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. కాగా ఆ ఉద్యోగి మీద అమ్మాయి బంధువులు ఫిర్యాదు చెయ్యగా.. తనకు ఏమీ తెలియదని బుకాయించాడు.  అంతకుముందు కూడా అతడు అమ్మాయిలనే వేధించాడని ఫిర్యాదులున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RIMS  Srikakulam  Harassment  Girl face Harassment  Harassment in RIMS  RIMS Hospital  

Other Articles