Rahul Gandhi seeks VK Singh's removal from PM Narendra Modi

Rationalists killed by fanatics but pm remains silent rahul gandhi

modi, rahul gandhi, rajnath singh, intolerance, sedition, shashi tharoor, lok sabha, intolerance, live updates, parliament, parliament live, lok sabha, rajya sabha, india, india news, india intolerance, rajnath singh, venkaiah naidu

Both, Lok Sabha and Rajya Sabha are discussing the issue of intolerance during the Winter Session of Parliament today.

మత విద్వేషాలను రెచ్చగోట్టి వేడుక చూస్తున్న బిజేపి..!

Posted: 12/02/2015 07:40 AM IST
Rationalists killed by fanatics but pm remains silent rahul gandhi

ఎన్డీఏ ప్రభుత్వంపై లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. హేతువాదుల హత్యలపైనా, బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా..  ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించారని రాహుల్ విమర్శించారు. అసహనంపై చర్చ సందర్భంగా ఆయన ఉద్రేకపూరితంగా మాట్లాడారు. ప్రజల మాటలను ప్రధాని మోదీ వినడం లేదని విమర్శించారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీకి రాజ్యాంగం పట్ల గౌరవం ఉందా? అని ప్రశ్నించారు.

మహాత్మాగాంధీని పొగిడిన ప్రధాని... గాడ్సేను దేశభక్తుడన్న సాక్షి మహరాజ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని విమర్శించారు. కేవలం ముస్లిం అయినందువల్లే అఖ్లాక్ ను హత్య చేశారని... ఆయన కుమారుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తూ సారే జహసే అచ్ఛా హిందూస్థాన్ హామారా అంటూ దేశానికి సేవ చేస్తున్నారని... ఇందులో బాధాకరమైన అంశమేంటంటే, ఈ ఘటనపై ప్రధాని మోదీ ఇంతవరకు స్పందించకపోవడమని విమర్శించారు. మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతోందని మండిపడ్డారు.

తన హయాంలో గుజరాత్ అభివృద్ధి చెందిందని, అలాగే దేశం మొత్తానికి మంచి రోజులు వస్తాయని గతంలో మోదీ చెప్పారని... ఇప్పుడు అదే గుజరాత్ లో పటిదార్ ఆందోళన చెలరేగిందని ఎద్దేవా చేశారు. ఇదేనా గుజరాత్ అభివృద్? అని రాహుల్ ప్రశ్నించారు. సామాన్యుల గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని అన్నారు. అసహనానికి వ్యతిరేకంగా మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించారని, అవార్డులు వెనక్కి ఇచ్చేశారని చెప్పారు. సహనంతో మెలిగితేనే భారత్ తన గొప్పదనాన్ని నిలుపుకుంటుందని అన్నారు.

పాకిస్థాన్ ఫెయిల్ కావడానికి కారణం అక్కడ నెలకొన్న అసహనమే అని చెప్పారు. పాక్ పాలకులు అక్కడి ప్రజల గొంతులను నొక్కేస్తుంటారని... అలాంటి పరిస్థితి మన దేశంలో రాకూడదని సూచించారు. హర్యాణాలో దళిత పిల్లలను తగలబెడితే, కేంద్ర మంత్రి ఒకరు వారిని కుక్కలతో పోల్చారని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఆయనపై కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోగా.. కనీసం ఆ ఘటనపై కూడా స్పందించలేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో రోజు రోజుకూ అసహనం పెరిగిపోతోంది. ప్రధాని మోదీని ఎవరైనా విమర్శిస్తే వారిపై దాడులు చేస్తున్నారు. నిరసనలకు దిగితే రాజద్రోహం కేసులు పెడుతున్నారు' అని రాహుల్ అరోపించారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi Lok Sabha Parliament Narendra Modi Intolerance  

Other Articles