Cinema Halls and Soppping malls Providing shelter to the people in the floods

Cinema halls and soppping malls providing shelter to the people in the floods

heavy Rains, Floods, Channai, Tamilnadu, Cinema Halls, Shopping malls, Tamilnadu Heavy rains

Cinema Halls and Soppping malls Providing shelter to the people in the floods

చెన్నైలో ధియేటర్లు, షాపింగ్ మాల్సే దిక్కు

Posted: 12/02/2015 05:05 PM IST
Cinema halls and soppping malls providing shelter to the people in the floods

తమిళనాడులో కురుస్తున్న భీకర వర్షాలకు అక్కడి పరిస్థితి చాలా దారుణంగా మారింది. అక్కడ రవాణా వ్యవస్త, టెలి కమ్యూనికేషన్ లాంటివి కట్ అయ్యాయి. ఇక అక్కడి ఊళ్లకు ఊళ్లు నీటిలో మునిగిపోయాయి. అక్కడ ఇళ్లు నీటిలో కనిపించకుండా... నిండా మునిగిపోయాయి. అయితే ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని జనాలకు అక్కడి ధియేటర్లు షాపింగ్ మాల్స్ ఆశ్రయం కల్పిస్తున్నాయి. గత వారం నుండి కురుస్తున్న వర్షాల కారణంగా  చెన్నై అతలాకుతలమవుతుంది. మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెన్నై నగరంలో 6 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. జనాలు తమ నివాసాలను ఖాళీ చేసిర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

Heavy-Rain-in-Chennai1
Heavy-Rain-in-Chennai10
Heavy-Rain-in-Chennai11
Heavy-Rain-in-Chennai2
Heavy-Rain-in-Chennai3
Heavy-Rain-in-Chennai4
Heavy-Rain-in-Chennai5
Heavy-Rain-in-Chennai6
Heavy-Rain-in-Chennai7
Heavy-Rain-in-Chennai8
Heavy-Rain-in-Chennai9

స్కూల్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించిన అక్కడి ప్రభుత్వం జనాలను తరలించే పనిలో ఉన్నారు. సైన్యం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలకు దిగింది. వర్షాల కారణంగా సినిమాలు బంద్ చేసి వరద బాధిత ప్రజలకు థియేటర్ యజమానులు ఆవాసం కల్పిస్తున్నారు. ఎవరికి తోచినట్లు వారు తమిళ ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నారు. వరదలకు ఇప్పటి వరకు 197 మంది మృతి చెందారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తుంది. పలు విమానాలు, 50 రైళ్లు రద్దు అయ్యాయి. చెన్నై విమానాశ్రయం అంతా నీటితో నిండిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heavy Rains  Floods  Channai  Tamilnadu  Cinema Halls  Shopping malls  Tamilnadu Heavy rains  

Other Articles