Osmania University in Ferment Over Beef Fest

Osmania university in ferment over beef fest

Beef Festival, Osmania University, Hyderabad, High Court, Police, Osmania University Beef Festival

With the organisers of the proposed beef festival steadfast on their decision to hold the programme, unmindful of a court ban, a tight security blanket was thrown over the sprawling campus of Osmania University on Wednesday, bringing afresh the memories of Telangana agitation when the campus had turned the hotbed of Telangana movement.

నేడే బీఫ్ ఫెస్టివల్.. ఓయులో ఉద్రిక్తత

Posted: 12/10/2015 08:54 AM IST
Osmania university in ferment over beef fest

ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గురువారం అభ్యుదయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం సిటీ సివిల్‌కోర్టు స్టే విధించడంతో, దీన్ని సమర్థిస్తూ హైకోర్టు ర్పునిచ్చింది. మరోవైపు కోర్టు ఆదేశాల ప్రకారం ఓయూలో ఎలాంటి ఫెస్టివల్స్‌కు అనుమతులు లేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వహిస్తే అడ్డుకుంటామని వారు పేర్కొంటున్నారు. దీంతో ఉస్మానియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పెద్దకూర పండుగకు కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే అనుమతి లేదు.. మిగతా ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు విధించలేదు... ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే విద్యార్థి నాయకులను, ఓయూలోని నాయకులను అరెస్టు చేస్తే ఎక్కడికక్కడ బీఫ్‌ తింటూ నిరసన తెలపాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రైల్వేస్టేషన్‌, బస్‌ స్టేషన్లలో బీఫ్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేయాలని ఆయా వర్సిటీల నాయకులకు ఇప్పటికే సూచనలు ఇచ్చారు. బీఫ్‌ ఫెస్టివల్‌ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం నుంచే ఓయూలో భారీగా మోహరించారు. ఏసీపీ లక్ష్మినారాయణ, సీఐ అశోక్‌ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. వీరి రాకను తెలుసుకున్న విద్యార్థులు హాస్టల్‌ తలుపులకు తాళాలు వేసుకుని లోపలే ఉండిపోయారు. క్రియాశీలకంగా పనిచేసే విద్యార్థులు ఎన్‌ఆర్‌హెచ్‌ అంబేద్కర్‌ హాస్టల్‌లో ఉన్నారనే అనుమానంతో ఆ వసతిగృహాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles