Telangana Congress leaders said that they dont afraid of TRS

Telangana congress leaders said that they dont afraid of trs

Congress, TRS, Janareddy, Uttam Kumar Reddy, KCR, Telangana, Telangana Govt

Telangana Congress leaders said that they dont afraid of TRS. Congress Senior Leader Janareddy said that Shabbir Ali got a warning throug phone

వాళ్లకు భయపడం అంటున్న కాంగ్రెస్ నేతలు

Posted: 12/12/2015 09:04 AM IST
Telangana congress leaders said that they dont afraid of trs

తెలంగాణ ప్రభుత్వం అణచివేత ధోరణితో దుర్మార్గపు పాలన కొనసాగిస్తోందని, టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై విమర్శలు చేస్తే చంపేస్తామని.. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్‌అలీని బెదిరించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండి స్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడినే చంపెస్తానని చెప్ప డం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ఎటుపోతుందో ప్రభుత్వం గమనించాలని వారు హెచ్చరిం చారు. ఆప్రజాస్వామ్యం పరకాష్టకు చేరిందని వారు మండి పడ్డారు. ప్రజలు, మేధావులు గమనించాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పిచ్చిపిచ్చి చేష్టలలకు పాల్పడితే .. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు చూస్తు ఊరుకోరన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవి తంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదన్నారు.

షబ్బీర్‌ అలీని చంపేస్తామని ఫోన్‌ వచ్చిందని జానారెడ్డి వివరించారు. నూతన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ ఎస్‌ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోందని ఉత్తమ్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాచరికపు పాలనను ప్రజలు గమనిస్తు న్నారని, ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. కిందిస్థాయి నుంచి బెదిరింపులు మొదలై రాష్ట్ర స్థాయి నేతల వరకు వచ్చిందని ఉత్తమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మండలి ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్థులను బెద రించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే అన్ని స్థాయిల్లోనూ ఫిర్యాదు చేశామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  TRS  Janareddy  Uttam Kumar Reddy  KCR  Telangana  Telangana Govt  

Other Articles