the-newer-rice-for-diabetic-patients

New variety of rice for siabetic patients

Diabetic patients, Indira Gandhi Agricultural University, new kind rice, new variety rice for diabetic patients, diabetic patients rice, diabetic patients food habits

raipur Indira Gandhi Agricultural University had develped a new variety of rice for diabetic patient

డయాబెటిక్ పేషంట్లకు శుభవార్త.. వారునూ అన్నం తినవచ్చు

Posted: 12/12/2015 04:40 PM IST
New variety of rice for siabetic patients

మధుమేహ రోగులు అన్నం తినాలన్న కోరికను ఇక చంపుకోనవసరం లేదు. అందరి మాదిరిగానే వారు సంతోషంగా అన్నం తినవచ్చు. అయితే ఇక్కడే ఒక ట్విస్టు వుంది. అందిరిలా అన్ని రకాల బియ్యాలతో వండిన అన్నం కాకుండా మధుమేహ వ్యాధి గ్రస్తుల కోసం అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక వరి వంగడం ద్వారా పండించిన అన్నాన్ని ఇకపై తృప్తిగా ఆరగించవచ్చు. డయాబిటీస్ పేషంట్లకు అన్నం ప్రధాన శత్రువుగా మారిన నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించేలా పరిశోధకులు గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉండి అధిక దిగుబడినిచ్చే కొత్త వరి వంగడాన్ని కనిపెట్టారు.

 ఇది మధుమేహ రోగులకే కాకుండా సాధారణ ప్రజలకూ ఆరోగ్యకరమైన ఆహారంగా ఉపయోగపడుతుందన్నారు. రాయపూర్‌లోని ఇందిరాగాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు దీన్ని రూపొందించారు. వచ్చే నెల వీటిని వాణిజ్య ప్రాతిపదికన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సంప్రదాయంగా సాగుచేసే ‘చపాతీ గుర్మతీయ’ అనే వరి రకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని తయారు చేసినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన గిరీశ్ చందెల్ తెలిపారు.  వరి ప్రధాన ఆహార వనరుగా ఉన్న మన దేశంలో ఈ కొత్త ఆవిష్కరణ ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diabetic patients  Indira Gandhi Agricultural University  new kind rice  

Other Articles