police-ride-on-pawn-brokers-in-andhra-pradesh-state-wide

Andhra pradesh police conduct state wide raids on illegal money lenders

Call Money Scam, call money scandal, Chandrababu Naidu, Vijayawada, YSR Congress, Andhra Pradesh, TDP leaders in call money, police raids on illegal money lenders, police raids on pawn brokers, police raids on call money brokers, call money havac in AP, Police raids in Andhra Pradesh,

with call money scandal, Andhra pradesh police starded raids on illegal money lenders and pawn brokers

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల దాడులు.. కాల్ మనీ కాలయముళ్ల గుండెల్లో రైళ్లు

Posted: 12/16/2015 08:35 PM IST
Andhra pradesh police conduct state wide raids on illegal money lenders

కాల్ మనీ అంటే ఎదో చిన్నా చితక వ్యాపారస్థులు జరిపిన తంతు అనుకుని విచారణ చేపట్టిన పోలీసులకు తొవ్విన కొద్ది కొత్త విషయాలు తెలియడంతో విస్మయానికి గురవుతున్నారు. వడ్డీలు కట్టలేని బాధితుల ఆస్తులను తమ పేరున రాయించుకోవడంతో పాటు వారిని వ్యభిచారం వృత్తిలోకి బలవంతంగా పంపి ఆ సోమ్మును కూడా వారు స్వాధీనం చేసుకుంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసును తొవ్వుతున్న పోలీసులకు అధికంగా అధికార పార్టీ ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకుతలో పాటు పలువురు అగ్రనాయకులకు కూడా సంబంధాధాలున్నాయన్న వార్తలు వినబడుతున్నాయి. పలువరు ఎమ్మెల్యేలతో పాటు, ఎన్ ఆర్ ఐ లు, ప్రముఖులు, ఒకరిద్దరు మంత్రులకు కూడా సంబంధాలున్నాయిన్న అరోపణలు గుప్పుమంటున్నాయి.

కాగా ఈ మొత్తం వ్యవహరంపై జాతీయ మానవహక్కుల కమీషన్ తీవ్రంగా పరిగణించి.. రాష్ట్ర సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడులకు నోటీసులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, గుత్తిలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడి చేసి... దాదాపు రూ. 4 కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లతోపాటు 20 ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై మంగళవారం అర్థరాత్రి పోలీసులు సోదాలు చేశారు. కె.వెంకటేశ్వరరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని, అతని నుంచి 59 ప్రామిసరీ నోట్లు, ఆరు ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. సోదాల నేపథ్యంలో పలువురు వ్యాపారులు పరారీలో ఉన్నారు. అటు విజయనగరం: జిల్లా లోని పలు ప్రాంతాల్లోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడి చేసి... 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు జిల్లాలోని వినుకొండ పోలీసులు వడ్డీ వ్యాపారుల కార్యకలాపాలపై దృష్టి సారించారు. స్థానికంగా 30 మంది వ్యాపారులను గుర్తించి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు, ఆభరణాలు, నగదు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
 
చిత్తూరు పట్టణానికి చెందిన నలుగురు బాధితులు పట్టణ డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు కాలమనీ గురించి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో వడ్డీ వ్యాపారులంతా ప్రభుత్వ ఉద్యోగులేననే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వడ్డీ వ్యాపారంలో ఆర్టీసీ, మున్సిపాలిటీ, ట్రాన్స్‌కో, ఉపాధ్యాయులు కూడా ఉన్నట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police ride  pawn brokers  call money  AndhraPradesh  

Other Articles