2012 డిసెంబర్ 16న నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన ఆరుగురు దోషుల్లో ఒకరికి 18ఏళ్లు నిండలేదనే కారణంతో ఉరివేయకుండా మూడేళ్లు జువెనైల్ హోంలో ఉంచి నేడు విడుదల చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అబ్జర్వేషన్ హోంలో రెండేళ్లపాటు గట్టి నిఘాలో ఉంచుతారు. మరోవైపు బాల నేరస్థుడికి కూడా ఉరి శిక్ష విధించాలని నిర్భయ తల్లిదండ్రులు కోరుతున్నారు. మూడేళ్లుగా వారు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే భారత్లో 18 ఏళ్ల లోపువారికి ఉరి వేసే అవకాశం లేకపోవడం వల్ల బాల నేరస్థుడు తప్పించుకోగలిగాడు. 16ఏళ్లు నిండిన ఇలాంటి దోషులకు ఉరి వేసేలా చట్టాన్ని సవరించాలని బిజెపితో పాటు మిగతా పార్టీలు కోరుతున్నా సవరణ మాత్రం జరగలేదు.
ఈ నేపథ్యంలో బాల నేరస్థుడు నేడు విడుదలయ్యాడు. ఇండియా గేట్ వద్ద నిర్భయ తల్లిదండ్రులతో పాటు అనేక మంది మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు నిర్భయకు న్యాయం జరగాలని, నిందితుడిని విడుదల చేయరాదని డిమాండ్ చేశారు. జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఢిల్లీ మహిళా కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన కుమార్తెపై అత్యాచారం చేసిన దోషిని వదిలిపెట్టడం వల్ల అతడు గెలిచినట్లైందని, తాను ఓడిపోయినట్లైందని నిర్భయ తల్లి కన్నీళ్లతో చెబుతున్నారు. మార్పును తీసుకువస్తాం, అచ్చే దిన్ అంటున్న మోడీ. ప్రబుత్వం. చట్టాలను సవరించడంలో అలక్ష్యమే వహించిందని అమె ఆరోపించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more